IPL 2020: రనౌట్ మిస్ చేసిన రిషబ్ పంత్.. ట్రోలింగ్‌తో ఆడుకుంటున్న నెటిజన్స్

ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బాట్స్‌మెన్స్ పృథ్వీ షా, రిషబ్ పంత్‌ను నెటిజన్స్ ట్రోల్స్‌తో ఆడుకుంటున్నారు. ఐపిఎల్ 2020 లో ఇప్పటివరకు ఈ యువ ఆటగాళ్ళు మెరుగైన ప్రదర్శనను ఇవ్వలేకపోతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బాట్స్‌మెన్స్ పృథ్వీ షా, రిషబ్ పంత్‌ను నెటిజన్స్ ట్రోల్స్‌తో ఆడుకుంటున్నారు. ఐపిఎల్ 2020 లో ఇప్పటివరకు ఈ యువ ఆటగాళ్ళు మెరుగైన ప్రదర్శనను ఇవ్వలేకపోతున్నారు.

  • Share this:
    ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బాట్స్‌మెన్స్ పృథ్వీ షా, రిషబ్ పంత్‌ను నెటిజన్స్ ట్రోల్స్‌తో ఆడుకుంటున్నారు. ఐపిఎల్ 2020 లో ఇప్పటివరకు ఈ యువ ఆటగాళ్ళు మెరుగైన ప్రదర్శనను ఇవ్వలేకపోతున్నారు. మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో పంత్ స్టంప్స్ వెనుక చురుకుగా కనిపించినప్పటికి.. టైమింగ్ మిస్‌ అయ్యాడు. వికెట్ కీపింగ్‌లో కాప్త తడబడ్డాడు. గాయం కారణంగా గత మ్యా్చ్‌లు ఆడలేకపోయిన పంత్.. కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిఎంట్రీ ఇచ్చాడు. బంతులను నియంత్రించడంలో విఫలమయ్యాడు.ముఖ్యంగా నికోలస్ పూరన్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. దీంతో ఢిల్లీ తగిన మూల్యం చేల్లించుకోవాల్సి వచ్చింది. కీపింగ్‌లో ,బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పంత్‌ను ట్రోల్స్‌ చేస్తూ ఆడుకుంటున్నారు అభిమానులు

    అబుదాబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 164 రన్స్ చేసింది.ఈ మ్యాచ్‌లోనూ గబ్బర్‌ గర్జించాడు. సెంచరీతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు.గబ్బర్ (106 నాటౌట్‌; 61 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్‌లు) సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఢిల్లీ 164 పరుగుల మార్క్‌ను సాధించింది. పృథ్వీషా (7) పంత్‌ (14),శ్రేయస్‌ (14),స్టోయినిస్ ‌(9) స్వల్ఫ పరుగులకే ఔట్ కావడంతో పంజాబ్ ముందు ఢిల్లీ భారీ లక్యాన్ని ఉంచలేకపోయింది. అనంతరం దిగిన పంజాబ్.. ఆరంభంలోనే సారథి కేఎల్ రాహుల్ వికెట్ కొల్సోయింది. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గేల్ విధ్యంసం సృష్టించాడు. ఢిల్లీ బౌలర్ తుషార్‌ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. వరుసగా 4, 4, 6 తో ఆ బౌలర్‌ను బెదరగొట్టాడు. ఆ ఓవర్లో తుషార్‌ 26 పరుగులు ఇచ్చాడు. అతను నిష్క్రమణ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హఫ్ సెంచరీతో పంజాబ్ విజమతీరాలకు చేర్చాడు,











    అయితే అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో పూరన్ రన్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. కవర్స్ దిశగా పూరన్ షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. మరొ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్.. బంతి ఫీల్డర్ దగ్గరకు వెళ్లడాన్ని గమనించి వెనుదిరిగాడు. అప్పటికే సగం దూరం వరకు పరిగెత్తిన పూరన్ తిరిగి వెనక్కి వెళ్లే సరికే బంతి వికెట్ల దగ్గరకు వచ్చింది. ధావన్.. కుడి చేత్తో బంతిని విసరడంతో అది వికెట్లకు దూరంగా వెళ్ళిపోయింది. దీంతో బంతిని డై చేసి పట్టుకున్న పంత్ దాన్ని వికెట్ల వైపు విసరలేకపోయాడు. ఫలితంగా  పూరన్ రన్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంత్ కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే పూరన్ పది పరుగుల వద్దే ఔటయ్యేవాడు. ఆ లైఫ్‌తో 28 బంతుల్లో 53 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు
    Published by:Rekulapally Saichand
    First published: