వారు ఎప్పుడు ప్రశ్నార్థకమే.. ఓడిపోయే మ్యాచ్‌ని అతను 10 నిమిషాలలో గెలిపిస్తాడు

ప్రతి బాట్స్‌మెన్ నిలకడగా అడుతూ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో మ్యాచులను గెలిపించాలి. చాలా మంది క్రికెట్ అభిమానులు బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ యువ బాట్స్‌మెన్స్‌కు సాధించగల సత్తా ఉంది.

Rekulapally Saichand
Updated: August 13, 2020, 1:11 PM IST
వారు ఎప్పుడు ప్రశ్నార్థకమే..  ఓడిపోయే మ్యాచ్‌ని అతను 10 నిమిషాలలో గెలిపిస్తాడు
sanju samson and pant
  • Share this:


యువ క్రికెటర్స్ రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌‌ టాలెంటేడ్ ప్లేయర్స్ అన్నారు మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌. నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌ని పూర్తిగా మార్చేసే సత్తా వీరికి ఉన్నప్పటికి నిలకడగా ఆడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడిన మంజ్రేకర్‌ పలు విషయాలను వెల్లడించారు.

ఈ ఇద్దరూ ఆటగాళ్ళు కొన్ని సమయాలలో సందేహాస్పదంగా కనిపిస్తారన్నారు. 'వాఖ్యాతగా వారి ఆటతీరును విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మా అభిప్రాయాలు ఒప్పు లేదా తప్పు అవుతుంటాయి. నాకు ఎప్పుడు వారు అర్ధం కారు. వారిలోని ఆట వివరించడం చాలా కష్టం. నంత్ సాహసి, ఓడిపోతామనుకున్న మ్యాచ్ నిమిషాల్లో గెలిపిస్తాడు. పంత్‌ది అదే పంతా. ఊపు మీదున్నడంటే ప్రత్యర్థికి కష్టమే" అన్నారు మంజ్రేకర్‌

ప్రతి బాట్స్‌మెన్ నిలకడగా అడుతూ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో మ్యాచులను గెలిపించాలి. చాలా మంది క్రికెట్ అభిమానులు బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ యువ బాట్స్‌మెన్స్‌కు సాధించగల సత్తా ఉంది. గణాంకాలే వారి ప్రతిభ ఏంటో తెలియజేస్తాయి. త్వరలోనే ఐపీఎల్‌ ఆరంభం అవుతోంది. ఈ మెగా టోర్నీలో ఫ్యాన్స్ అశించిన స్ధాయిలో వీరు అడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ బాగా ఆడి తర్వాత మ్యాచ్‌లను వదిలేసినట్టు ఉండొద్దు. ఇలా చేయడం వారి భవిష్యత్‌పై ప్రభావం అవకాశం ఉంటుదన్నారు"
Published by: Rekulapally Saichand
First published: August 13, 2020, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading