• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • RISHABH PANT HIT MAIDEN FIFTY OF IPL 2020 IN FINAL AND TROLLS ARE DELETING THEIR MEMES SA

IPL 2020: అయ్యా.. నువ్వు దేవుడివి.. ఆఖరికి సాధించావు

IPL 2020: అయ్యా.. నువ్వు దేవుడివి.. ఆఖరికి సాధించావు

Rishabh Pant

ఈ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ మీద నెటిజన్స్ చేసినన్ని ట్రోల్స్ మరే ఏ ఆటగాడు మీద చేయలేదోమో.. దుబాయ్ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడిన విషయం తేలిసిందే!

  • Share this:
    ఈ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ మీద నెటిజన్స్ చేసినన్ని ట్రోల్స్ మరే ఏ ఆటగాడు మీద చేయలేదోమో.. దుబాయ్ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020  ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడిన విషయం తేలిసిందే!. ఈ మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో  రాణించారు

    గత మ్యాచ్‌లలో దారుణంగా విఫలమవుతూ వస్తున్న క్యాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చివరిసారిగా  ఉత్తమ ఇన్నింగ్స్‌ను ఆడాడు. రిషభ్‌ పంత్‌ 38 బంతుల్లో 56 చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో తోర్పాడ్డాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ దాటికి కుదేలైన బ్యాటింగ్ లైన్‌ప్‌ను చక్కదిద్దాడు.  బౌల్ట్‌ వేసిన తొలి బంతికే స్టొయినిస్‌ (0) ఔట్ కాగా, అజింక్య రహానే (2), శిఖర్‌ ధావన్‌ (15) తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరారు. దీంతో 22 పరుగులకు 3 వికెట్లు కోల్పొయి కష్టాల్లో ఉన్న ఢిల్లీ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని పంత్‌ ఈ మ్యాచ్‌లో క్లాష్ షాట్లతో ఆకట్టుకున్నాడు.  కృనాల్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. వీరిద్దరి నాల్గవ వికెట్‌కు 96 పరుగులు జోడించారు.

    పంత్ మళ్ళీ ఫామ్‌లోకి రావడం చూసి క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యాఖ్యాత హర్ష భోగ్లే పంత్ తిరిగి ఫామ్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు.  "ఈ రిషబ్ పంత్ ఆట చూడటానికి ఐపిఎల్ మెుత్తంగా వేచి చూశా" అని భోగ్లే చమత్కరించారు. ఇక ఇంతకుముందు ట్రోల్స్‌తో ఆడుకున్న నెటిజన్స్ ఈసారి ప్రశంసలు కురిపించారు.













    అతనిపై చేసిన ట్రోల్స్ ‌,మిమ్స్ ను డిలేట్ చేశారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు