Home /News /ipl /

REPORT MI VS DC QUALIFIER 1 DREAM11 PREDICTION MUMBAI INDIANS VS DELHI CAPITALS BEST XI MI VS DC LIVE AT 730 PM SA

IPL 2020: ఫైనల్‌ చేరిందో.. ఐపీఎల్ 2020 టైటిల్ విజేత ఆ జట్టే!

IPL PLAYOFFS 2020

IPL PLAYOFFS 2020

ఆ జట్టుతో పెట్టుకోవాలంటే అన్ని టీంలు దడ..దడే.. ఐపీఎల్‌లో ఆ జట్టును ఏ స్థాయిలో చూసిన బలంగానే కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ స్ట్రాంగ్‌గా కనిపిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో దిట్ట..



    ఆ టీంతో పెట్టుకోవాలంటే అన్ని టీంలకు దడ..దడే.. ఐపీఎల్‌లో ఆ జట్టును ఏ స్థాయిలో చూసిన బలంగానే కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉంటూ  ప్రత్యర్థులను కట్టడి చేయడంలో దిట్ట.. వారిని ఓడించడమంటే కత్తి మీద సామే! అదే నాలుగు సార్లు టైటిల్ సాధించి.. ప్రస్తుత ఐపీఎల్‌లో టెబుల్ టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్.  ఆ జట్టులో ఉన్న వాళ్ళంతా హిట్టర్సే. ప్రపంచంలో అన్ని టీమ్స్‌లోని ఉద్దండులంతా కలిసి ఆ జట్టులో ఉన్నంట్లుగా అనిపిస్తుంది. వారు ఫైనల్‌ చేరంటే టైటిల్‌ పక్కా అన్నట్టే ఉంటుంది. ఇప్పటివరకు ఐదుసార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం టెబుల్ టాఫర్ ఉన్న రోహిత్ సేన మరోసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

    2019లో చెన్నైపై ఒక పరుగుతో విజయం

    2019లో చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. ఆ ఏడాది ముంబై ప్రయాణాన్ని ఓసారి చూస్తే దిల్లీ, చెన్నైతో పాటు 18 పాయింట్లతో సాధించి +0.421 రన్‌రేట్‌తో టేబుల్ టాఫర్‌గా నిలిచింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేనను 148 పరుగులకే కట్టడి చేసింది. మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై.. పొలార్డ్‌ (41) డాషింగ్ బ్యాటింగ్ కారణంగా 149 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై షేన్‌ వాట్సన్‌ (80) దాటిగా ఆడిన మిగితా బాట్స్‌మెన్స్ ముంబై బౌలర్ల ముందు నిలవలేకపోయారు. చివరి ఓవర్లో చెన్నై గెలవాలంటే 6 బంతుల్లో 9 పరుగులు కావాలి.. మలింగ వేసిన ఆ ఓవర్‌లో సీఎస్‌కే 8 పరుగుల చేయడంతో ముంబయి ట్రోఫీని ముద్దాడింది.



    2017- పుణేపై ఒక్క పరుగుతో విజయం

    2017లోనూ ఒక్క పరుగుతో పుణెపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక్కడ కూడా అఖరి ఓవర్‌లోనే మ్యాచ్ డిసైడ్ అయింది. పుణె విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కావాలి. అయితే ఆ ఓవర్లో 9 పరుగులే రావడంతో ముంబై మరోసారి టైటిల్ సొంతం చేసుకుంది.



    2015లో చెన్నైపై ఘన విజయం

    చెన్నై, ముంబై మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లో 202/5 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనను ఆరభించిన చెన్నై .. ముంబై బౌలర్ల దాటికి విలవిలాడింది. ధోనీసేన 161/8కే పరిమితమైంది.

    2013 మెుదటి సారి టైటిల్ గెలిచింది చెన్నైపైనే

    2013లో చెన్నై, ముంబై మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి 148/9కే పరిమితమైంది. కీరన్‌ పొలార్డ్‌ (60), అంబటి రాయుడు (37) మినహా ఎవరూ రాణించలేదు. అనంతరం ఛేదనను ప్రారంభించిన ధోనీసేన 125/9కే పరిమైంది. దీంతో ముంబాయి మెుదటిసారి ఐపీఎల్
    టైటిల్ సాధించింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    తదుపరి వార్తలు