ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs RR, IPL 2020: దుబాయ్‌లో కొహ్లీ, డివిలియర్స్ షో.. బెంగళూరు విజయం

RCB vs RR, IPL 2020: ఈ టోర్నీలో ఆర్సీబీ, ఆర్ఆర్ రెండు సార్లు తలపడగా.. రెండు సార్లూ బెంగళూరే గెలిచింది. తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.

news18-telugu
Updated: October 17, 2020, 7:25 PM IST
RCB vs RR, IPL 2020: దుబాయ్‌లో కొహ్లీ, డివిలియర్స్ షో.. బెంగళూరు విజయం
ఏబీ డివిలియర్స్ (Image:IPL)
  • Share this:
IPL 2020: దుబాయ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. రాజస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. అరోన్ పించ్ మినహా మిగిలిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ రఫ్పాడించారు. ముఖ్యంగా కెప్టెన్ కొహ్లీ, డివిలియర్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు మరో విజయం అందించారు. 178 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో చేధిచింది ఆర్సీబీ టీమ్. డివిలియర్స్ హాష్ సెంచరీ చేశాడు. 22 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు. విరాట్ కొహ్లీ 43 (32 బంతులు), దేవదత్ పడిక్కల్ 35 (37 బంతులు), గురుకీరట్ సింగ్ మాన్ 19 (18 బంతులు) రన్స్ చేశారు. ఆర్సీబీ జట్టు స్కోర్ 23 పరుగులు వద్ద అరోన్ ఫించ్ (14) వికెట్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కొహ్లీ.. పడిక్కల్‌తో కలిసి ఆచితూచి ఆడారు. ఇద్దరు విలువైన భాగస్వామ్యం అందించారు.

ఐతే 102 పరుగుల వద్ద రెండు వరుస బంతుల్లో పడిక్కల్, కొహ్లీ ఔటవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఐతే 19వ ఓవర్లో రాయల్స్ బౌలర్ ఉనద్కత్‌పై డివిలియర్స్ విరుచకుపడ్డాడు. హ్యాట్రిక్ సిక్సుతో పాటు ఫోర్ బాదడంతో ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. ఆ తర్వాతి ఓవర్‌లో సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు డివిలియర్స్. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తెవాటియా, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ సాధించారు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 36 బంతుల్లో 57 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 41 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ 24, రాహుల్ తెవాటియా 19 పరుగులు చేశారు. జట్టుకు రాబిన్ ఊతప్ప, స్టోక్స్ శుభారంభమే అందించారు. ఐతే 50 స్కోర్ వద్ద మొదట స్టోక్స్ ఔటయ్యాడు. ఆ తర్వాత 69 పరుగుల వద్ద ఊతప్ప పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే శామ్సన్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. మూడు వికెట్లు పడడంతో బట్లర్, స్మిత్ ఆచితూచి ఆడుతూ ఇన్సింగ్ చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్ క్రిస్ మోరిస్ అద్భుతమైన బంతులు విసిరి అదరగొట్టాడు. 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తీశాడు.

ఈ టోర్నీలో ఆర్సీబీ, ఆర్ఆర్ రెండు సార్లు తలపడగా.. రెండు సార్లూ బెంగళూరే గెలిచింది. తాజా గెలుపుతో
పాయింట్ల పట్టికలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింట పరాజయం పాలయింది. ప్రస్తుతం ఆ జట్టుకు పన్నెండు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడో స్థానంలో కొనసాగుతోంది. 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. మిగిలిన ఐదింట ఓటమి పాలయింది. రాజస్థాన్ టీమ్‌కు ఇప్పటి వరకు 6 పాయింట్లు మాత్రమే సాధించింది.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading