ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs MI, IPL 2020: చెలరేగిన సూర్యకుమార్.. ప్లేఆఫ్స్‌కు ముంబై

RCB vs MI, IPL 2020: సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో మూడు సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి.

news18-telugu
Updated: October 28, 2020, 11:24 PM IST
RCB vs MI, IPL 2020: చెలరేగిన సూర్యకుమార్.. ప్లేఆఫ్స్‌కు ముంబై
సూర్యకుమార్ యాదవ్ (Image;IPL)
  • Share this:
RCB vs MI, IPL 2020: అబుదాబిలో సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో ముంబై జట్టును గెలిపించి.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేశాడు. బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్. బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో మూడు సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 25, డికాక్ 18, హార్దిక్ పాండ్యా 17, కృనాల్ పాండ్యా 10, సౌరబ్ తివారి 5, పొలార్డ్ 4 పరుగులు చేశారు. వికెట్లు పడుతున్నా..సూర్య కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, యుజ్వేంద్ర చాహల్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారీగా స్కోర్ చేస్తుందనుకున్న కొహ్లీ సేన.. ఆఖరి ఓవర్లలో తడబడడంతో తక్కువ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ 74 పరుగులతో సత్తా చాటాడు. జోష్ ఫిలిప్ 33 రన్స్ చేశాడు. ఆర్సీబీ ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ జట్టుకు శుభారంభం ఇచ్చారు. 71 రన్స్ వద్ద ఫిలిప్, 95 వద్ద కొహ్లీ ఔట్ అవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఆ తర్వాత 16, 17, 18 ఓవర్లలో ఏకంగా నాలుగు వికెట్లు పడడంతో.. బెంగళూరు స్కోర్ 164కు పరిమితమయింది. లేదంటే బెంగళూరు 200 పరుగులు చేసేది. ఆఖరులో ముంబై బౌలర్లు విజృంభించడంతో స్కోర్ తగ్గిపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక బౌల్ట్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.

ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, ముంబై జట్లు 27 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు జట్లు ఓసారి తలపడ్డాయి. సెప్టెంబరు 28న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై, బెంగళూరు జట్లు 201 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్లో కొహ్లీ సేన గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంది ముంబై. అంతేకాదు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది.

ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు 8 మ్యాచ్‌లు గెలిచింది. మరో 4 ఓడిపోయింది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక బెంగళూరు విషయానికొస్తే... ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన 7 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఐదింటిలో పరాజయం పాలయింది. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: October 28, 2020, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading