ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, RCB vs MI:ఆర్సీబీ అసాధారణ విజయం.. ఇషాన్‌ కిషన్‌ విరోచిత పోరాటం

ముంబై ఇండియన్స్,రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్ టై అయ్యింది. చివర్లో ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6), పొలార్డ్‌ (60; 24 బంతుల్లో 3x4, 5x6) చెలరేగడంతో స్కోర్స్ సమం అయ్యాయి

news18-telugu
Updated: September 29, 2020, 12:35 AM IST
IPL 2020 Live Score, RCB vs MI:ఆర్సీబీ అసాధారణ విజయం.. ఇషాన్‌ కిషన్‌ విరోచిత పోరాటం
ఇక ముంబాయ్ విషయానికి వస్తే అరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన తర్వాత కోల్‌కత్తా నెగ్గి మళ్ళీ టచ్‌లోకి వచ్చింది. ఇరు జట్లు ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
  • Share this:
ముంబై ఇండియన్స్,రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగిన మ్యాచ్ టై అయ్యింది. చివర్లో ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6), పొలార్డ్‌ (60; 24 బంతుల్లో 3x4, 5x6) చెలరేగడంతో స్కోర్స్ సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఆర్సీబీ నుంచి నవ్‌దీప్‌ సైనీ బౌల్ చేయగా.. ముంబై (1,1,0,4,W,1) కేవలం 7 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ దిగిన బెంగళూర్ (1,1,0,4,1,4) 11 పరుగులు చేసి విజయం సాధించింది. ముంబై నుంచి జస్ప్రీత్‌ బుమ్రా బౌల్ చేశారు.

ఈ సూపర్ ఫైట్‌లో రాయల్స్‌ అద్భుతమైన విజయాన్నే అందుకుంది. ముంబై జట్టును కట్టిడి చేసి మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 201 పరుగుల భారీ లక్ష్యాన్ని సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. చివరకు ఆర్సీబీని విజయం వరించింది.

POINTS TABLE: ఆదిలోనే ముంబై ఇండియన్స్‌ కష్టాల్లో పడింది. పవర్ ఫ్లేలోనే రెండు కీలక వికెట్లు కొల్పోయి ఇబ్బందుల్లోకి వెళ్ళింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 2వ ఓవర్‌లోనే భారీ షాట్‌ ప్రయత్నించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8) ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌(0) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరుగాడు. ఇసురు ఉదాన వేసిన మూడో ఓవర్‌ రెండో బంతిని ఆడబోయి డివిలయర్స్ చేతికి చిక్కాడు. తర్వాత ఓపెనర్ డికాక్(14).. చాహల్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. హార్దిక్‌ పాండ్య(15)ను ఆడం జంపా పెవిలియన్‌కు పంపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6),  దాటిగా ఆడి గెలుపుపై ముంబై ఆశలను సజీవంగా ఉంచాడు. చివర్లో పోలార్డ్ (60; 24 బంతుల్లో 3x4, 5x6)  హిట్టింగ్‌కి తీరాన్ని తాకే అలల్లా పదే పదే బౌండరీ లైన్‌ను తాకింది బంతి. వీరిద్దరి విరోచిత పోరాటంతో మ్యాచ్ టైగా అయింది.అంతకుముందు మెుదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201పరుగుల చేసింది. ఓపెనర్స్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా . మరో ఒపెనర్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌)కూడా హఫ్ సెంచరీ సాంధించాడు. తర్వాత ఏబి డివిలియర్స్‌ (24 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌) సూపర్ హిట్టింగ్‌తో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనితో పాటు శివం దూబే (10 బంతుల్లో 27; 1 ఫోర్లు, 3 సిక్స్‌) కూడా చివర్లో దాటిగా ఆడడంతో ఆర్సీబీ 202 పరుగుల లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది.
Published by: Rekulapally Saichand
First published: September 28, 2020, 11:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading