IPL 2020 Live Score, RCB vs MI: కష్టాల్లో ముంబై ఇండియన్స్.. నిరాశపరిచిన రోహిత్

రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే కష్టాల్లో పడింది. పవర్ ఫ్లేలోనే రెండు కీలక వికెట్లు కొల్పోయి నిలకడగా ఆడుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 2వ ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8) ఔటయ్యాడు.

news18-telugu
Updated: September 28, 2020, 10:03 PM IST
IPL 2020 Live Score, RCB vs MI: కష్టాల్లో ముంబై ఇండియన్స్.. నిరాశపరిచిన రోహిత్
rohith sharma
  • Share this:
రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే కష్టాల్లో పడింది. పవర్ ఫ్లేలోనే రెండు కీలక వికెట్లు కొల్పోయి నిలకడగా ఆడుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 2వ ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8) ఔటయ్యాడు. భారీ షాట్‌ కొట్టిన రోహిత్ బౌండరీ లైన్‌ వద్ద పవన్‌ నేగి చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌(0) షాట్‌ ఆడబోయి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇసురు ఉదాన వేసిన మూడో ఓవర్‌ రెండో బంతిని డిఫరెన్స్ ఆడబోయి డివిలయర్స్ చేతికి చిక్కాడు.
దీంతో ముంబయి 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్,డికాక్ కొద్దిసేపు నిలకడగా ఆడినప్పటికి  చాహల్‌ వేసిన 7వ ఓవర్‌ నాలుగో బంతికి   భారీ షాట్  ప్రయత్నించబోయి ఫీల్డర్‌ పవన్‌ నేగి చేతికి చిక్కాడు. దీంతో ముంబయి 39 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.

POINTS TABLE:

మెుదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రోహిత్ శర్మ ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వనించారు. ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201పరుగుల చేసింది. ఒపెనర్స్ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మరో ఒపెనర్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌) హఫ్ సెంచరీలు సాంధించారు. చివర్లో ఏబి డివిలియర్స్‌ (55 బంతుల్లో 24; 4 ఫోర్లు, 4 సిక్స్‌)దాటిగా ఆడుతూ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడగా అందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Published by: Rekulapally Saichand
First published: September 28, 2020, 9:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading