RCB vs MI: ఆర్సీబీ భారీ స్కోర్.. డివిలియర్స్ సూపర్ హిట్టింగ్

ఐపీఎల్‌-13లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌,ముంబై ఇండియన్స్‌ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో వికెట్లకు 201పరుగుల చేసింది

news18-telugu
Updated: September 29, 2020, 12:36 AM IST
RCB vs MI: ఆర్సీబీ భారీ స్కోర్.. డివిలియర్స్ సూపర్ హిట్టింగ్
గత మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ 57 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. డెత్ ఓవర్లలో అత్యధిక పరగులను సమర్పించుకున్నాడు. కావున అతని స్దానంలో మరో బౌలర్ వచ్చే అవకాశం ఉంది. ఉమేష్ యాదవ్ స్ధానంలో మొహమ్మద్ సిరాజ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ స్థానంలో జోష్ ఫిలిప్ తుది జట్టులో ఉండనున్నారు.
  • Share this:
ఐపీఎల్‌-13లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌,ముంబై ఇండియన్స్‌ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  201పరుగుల చేసింది. ఒపెనర్స్ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా . మరో ఒపెనర్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌)కూడా హఫ్ సెంచరీ సాంధించాడు.



ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ నిరాచపరిచాడు.  ఐపీఎల్ 2020లో కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులు చేయగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశారు.ఈ మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు చేసి రాహుల్ చహార్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. తర్వాత ఏబి డివిలియర్స్‌ (24 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌) దాటిగా ఆడుతూ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని తోడుగా శివం దూబే (10 బంతుల్లో 27; 1 ఫోర్లు, 3 సిక్స్‌) కూడా చివర్లో హిట్టింగ్‌ బ్యాటింగ్ చేసి స్కోర్‌ను పరుగెత్తించాడు.

POINTS TABLE:



మెుదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రోహిత్ శర్మ ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వనించారు. ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇక ఆర్సీబీ కూడా రెండు మ్యాచ్‌లు ఆడగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడగా అందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Published by: Rekulapally Saichand
First published: September 28, 2020, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading