ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: సీఎస్‌కే ఫిట్‌నెస్‌ క్యాంప్‌కు కీలక ఆటగాడు దూరం!!

ఐపీఎల్‌కు ఫ్రాంఛైజీలు సిద్దమవుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మెుదలై ఈ మెగా టోర్నీకి కోసం ఆటగాళ్ళు పన్నద్దంచేస్తున్నాయి జట్ల యాజమాన్యాయాలు.

Rekulapally Saichand
Updated: August 14, 2020, 2:59 PM IST
IPL 2020: సీఎస్‌కే  ఫిట్‌నెస్‌ క్యాంప్‌కు కీలక ఆటగాడు దూరం!!
సీఎస్‌కే టీమ్
  • Share this:
ఐపీఎల్‌కు ఫ్రాంఛైజీలు సిద్దమవుతున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మెుదలై ఈ మెగా టోర్నీకి కోసం ఆటగాళ్ళు పన్నద్దంచేస్తున్నాయి జట్ల యాజమాన్యాయాలు. అన్ని టీంలు కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్‌కు చెన్నైలో ఒకవారం పాటు ఫిట్‌నెస్‌ క్యాంప్‌కు ఏర్పాటు చేసింది. త్వరలోనే జట్లు ఆటగాళ్ళు
అందరూ చెన్నైకి చేరుకొనున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఇనాళ్ళు ఇంటికే పరిమితమైన ఆటగాళ్ళు ఇప్పుడు ఐపీఎల్‌ కోసం కఠోర శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు ధోనీ,రైనా, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్ గ్రౌండ్ వెళ్ళి ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. త్వరలోనే వీరు కరోనా పరీక్షలు చేయించుకుని శిభిరానికి వెళ్ళనున్నారు. ధోనీ తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో త్వరలోనే ఆయన చెన్నైకి బయలుదేరనున్నారు. అయితే చెన్నై కీలక ఆటగాడైనా జడేజా వ్యక్తిగత కారణాల రిత్యా క్యాంప్‌కు హాజరకాలేకపోతున్నాడని ఆ జట్టు మెనేజర్ విశ్వనాథన్‌ వెల్లడించారు.
Published by: Rekulapally Saichand
First published: August 14, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading