చారు,పెరుగు ఆన్నం.. అదే ఐపీఎల్‌లో నా ఫిట్‌నెప్ వెనుక రహస్యం: రైనా

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్‌లో తన అద్భుతమైన పదర్శన వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. చెన్నై వాతావరణ పరిస్ధితులకు తగ్గట్టుగా డైట్ మెన్‌టైన్ చేయడం ద్వారానే టోర్నీలో తను మంచి ఫిట్‌నెస్‌గా ఉండగలుగుతున్నాని తెలిపాడు.


Updated: August 20, 2020, 3:41 PM IST
చారు,పెరుగు ఆన్నం.. అదే ఐపీఎల్‌లో నా ఫిట్‌నెప్ వెనుక రహస్యం: రైనా
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్‌లో తన అద్భుతమైన పదర్శన వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. చెన్నై వాతావరణ పరిస్ధితులకు తగ్గట్టుగా డైట్ మెన్‌టైన్ చేయడం ద్వారానే టోర్నీలో తను మంచి ఫిట్‌నెస్‌గా ఉండగలుగుతున్నాని తెలిపాడు.
  • Share this:
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్‌లో తన అద్భుతమైన పదర్శన వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. చెన్నై వాతావరణ పరిస్ధితులకు తగ్గట్టుగా డైట్ మెన్‌టైన్ చేయడం ద్వారానే టోర్నీలో తను మంచి ఫిట్‌నెస్‌గా ఉండగలుగుతున్నాని తెలిపాడు. తను చారు,పెరుగు అన్నం తినడం వల్లనే ఫిట్‌గా ఉన్నట్లు వివరించారు. ఆ డైట్ కారణంగానే ఎంఏ చిదంబరం స్టేడియంలో కఠినమైన సాధనలు చేయగలుగుతున్నాం అన్నారు. వేసవి సమయంలో చెన్నైలో ఉండే హిట్ తట్టుకోవాలంటే తీసుకునే ఆహారం పక్కాగా ఉండాలన్నారు. తాజాగా క్రిక్ బజ్ ఇంటర్వూలో హర్ష భోగ్లేతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించాడు.

అక్కడి వేడి తట్టుకోని మ్యాచ్ ఆడడంలో తన డైట్ ఎలా సహాకరించిదనే దానికి ఓ మ్యాచ్‌ని ఉదాహరణ చూపాడు. ఐపిఎల్ 2013 కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 100 పరుగులు చేయడంలో తన డైట్ ఎలా సహకరించిదో వివరించాడు.

"ఇటివలే ఆ మ్యాచ్‌ను రీపిట్‌గా చూశాను. 4 గంటలకు మ్యాచ్ మెుదలైంది. ఆ రోజు మ్యాచ్ ముందు ఉన్న ఎండ అందర్ని ఇబ్బంది పెట్టింది. ఈ పరిస్థితులలో రాణించడం కష్టం అనుకున్నారు. కానీ ఎమ్ఎస్(ధోనీ) మాత్రం అదేమి లెక్కచేయలేదు. ఈ సమయంలో ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైతే టీంకు అండగా ఉంటానని ధోనీకి నేను హామి ఇచ్చాను. ఆ ధైర్యం నాకు.. తీసుకునే ఆహరం ద్వారానే లభించింది. ఇంట్లో తీసుకునే డైట్ కాకుండా స్ధానిక పరిస్ధితి తగ్గట్టుగా ఆహార నియమాలు ఉండాలి. ఎండ నేరుగా తలపై పడుతుంది కావున డిహైడ్రేట్ కాకుండా మ్యాచ్‌లో రాణించలంటే ఫుడ్ సహాకారం చాలా ఉంటుంది. ఆ రోజు మ్యాచ్‌లో పెర్ఫార్మన్స్ కారణం రసం,పెరుగు ఆన్నమే అంటూ నవ్వుతూ చేపుకోచ్చాడు" రైనా.
Published by: Rekulapally Saichand
First published: August 20, 2020, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading