Home /News /ipl /

RAJASTHAN ROYALS SKIPPER STEVE SMITH FINED RS 12 LAKH FOR SLOW OVER RATE AGAINST MUMBAI INDIANS SK

IPL 2020: రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు షాక్.. రూ. 12 లక్షల జరిమానా

స్టీవ్ స్మిత్

స్టీవ్ స్మిత్

ఐపీఎల్‌లో ఇవాళ 21వ మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా రాత్రి 07.30కి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

    IPL 2020: మంగళవారం ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాచ్ రెఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించారు. ముంబై బ్యాటింగ్ సమయంలో రాజస్థాన్ జట్టు మినిమమ్ ఓవర్ రేట్‌ను మెయింటేన్ చేయపోవడంతో ఈ ఫైన్ పడింది. ఐపీల్ 2020 టోర్నీలో కెప్టెన్‌కు జరిమానా విధించడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు కెప్టెన్ కొహ్లీకి రూ.12 లక్షల చొప్పున జరిమానా పడింది.

    సెప్టెంబరు 29న సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ రెఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించారు. అంతకు ముందు బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కొహ్లీకి కూడా జరిమానా పడింది. సెప్టెంబరు 24న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు కావడంతో టీమ్‌ కెప్టెన్ కోహ్లీ ఫీజులో రూ.12 లక్షల జరిమానా విధిచారు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘోరంగా ఓటమి పాలయింది.

    ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్లోఓవర్ రేట్ మెయిన్‌టేన్ చేయకపోతే కెప్టెన్‌కు జరిమానా విధిస్తారు. స్లో ఓవర్ రేట్ కారణంగా మొదటి సారి రూ.12 లక్షలు ఫైన్ వేస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి చేస్తే రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఇక నాలుగో సారి తప్పు చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐతే తుది జట్టులో మాత్రం ఉండవచ్చు.


    మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 79, రోహిత్ శర్మ 35, హార్ధిక్ పాండ్యా 30, డికాక్ 23 రన్స్ చేశారు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్‌కు 2, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు..18.1 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటయింది. జోస్ బట్లర్ 70, ఆర్చర్ 24 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. బోల్ట్ 2, పాటిన్సన్ 2, రాహుల్ చాహర్ 1, పొలార్డ్ 1 వికెట్ తీశారు.

    ఇక ఐపీఎల్‌లో ఇవాళ 21వ మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా రాత్రి 07.30కి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, IPL 2020, Rajasthan Royals, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు