CSK VS RR: చెన్నైకి భారీ టార్గెట్ .. చితక్కొట్టిన సంజూ శాంసన్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)‌ మధ్య షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులకు రాజస్దాన్  రాయల్స్ మంచి బ్యాటింగ్ రుచిని చూపించింది.


Updated: September 22, 2020, 10:51 PM IST
CSK VS RR: చెన్నైకి భారీ టార్గెట్ .. చితక్కొట్టిన సంజూ శాంసన్‌
sanju samson SMITH
  • Share this:
చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)‌ మధ్య షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులకు రాజస్దాన్  రాయల్స్ మంచి బ్యాటింగ్ రుచిని చూపించింది. సీఎస్‌కేకు 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో రాజస్థాన్‌ రాయల్స్ బ్యాటింగ్‌కు  దిగింది.  రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.

తర్వాత  రాజాస్ధాన్ టీం నుంచి  యశస్వి  జైస్వాల్,కెప్టెన్ స్మిత్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగారు. ఆర్ఆర్ జైస్వాల్ వికెట్‌ను తొందరగానే కొల్పొగా. ఆ తర్వాత వచ్చిన సంజు సామ్సన్ దాటిగా ఆడుతూ చెన్నై బౌలర్లకు చుక్కులు చూపించాడు. 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో  అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.  రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన సంజూ.. తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. స్పిన్నర్ పీయూష్ చావ్లా ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు కొట్టాడు. తన పవర్ హిట్టింగ్‌తో టీ20 మజాను అభిమానులకు రుచిచూపించాడు. చివరిగా లుంగీ ఎంగిడి బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టబోయి చహర్‌కి క్యాచ్ ఇచ్చాడు. 32 బంతుల్లో ఒక్క ఫోర్. 9 సిక్స్‌లతో 74 పరుగులతొ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక కెప్టెన్ స్మిత్ 69 బంతుల్లో నాలుగు ఫోర్లు. 4 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ హిట్టింగ్ బ్యాటింగ్ చేశాడు. నాలుగు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. (27; 8 బంతుల్లో 4x6) లుంగి ఎంగిడీకి చుక్కలు చూపించాడు.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading