IPL 2020: రసవత్తర పోరులో రాజస్తాన్ సరికొత్త రికార్డు.. టాప్-5 సక్సెస్‌ఫుల్ చేజింగ్స్ ఇవే..

రాహుల్ తేవాటియా(Image- IPL/BCCI)

IPL 2020: ఆదివారం రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య జరిగిన రసవత్తర పోరుకు వేదికగా ఐకానిక్ షార్జా స్టేడియం నిలిచింది. టీవీల ముందుకు కుర్చున్న ప్రేక్షకులు తమ ముందు పరుగుల వరద పారుతుంటే ఆసక్తిగా మ్యాచ్‌ను వీక్షించారు.

  • Share this:
    ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య జరిగిన రసవత్తర పోరుకు వేదికగా ఐకానిక్ షార్జా స్టేడియం నిలిచింది. టీవీల ముందుకు కుర్చున్న ప్రేక్షకులు తమ ముందు పరుగుల వరద పారుతుంటే ఆసక్తిగా మ్యాచ్‌ను వీక్షించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేటాయించిన కొండత లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండానే చేధించిన రాజస్తాన్ జట్టు ఔరా అనిపించింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేజింగ్‌లో తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. 2008లో డెక్కన్ చార్జర్స్ నిర్దేశించిన 215 పరుగులను రాజస్తాన్ జట్టు విజయవంతంగా చేధించింది. చేజింగ్‌కు సంబంధించి ఐపీఎల్‌లో ఇదే రికార్డు. తాజాగా పంజాబ్ జట్టు నిర్దేశించిన 224 పరుగులు లక్ష్యాన్ని చేధించిన రాజస్తాన్.. చేజింగ్‌లో తమ జట్టుకెవ్వరూ సాటిలేరని నిరూపించింది. చేజింగ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు ఐదు ఓవర్లలోపే 50 పరుగులు పూర్తి చేసింది. మాయంక్ అగర్వాల్ 106 పరుగులు, రాహుల్ 69 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. దీంతో నిర్ణిత ఓవర్లలో పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్ 27 బంతుల్లో 50 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత సంజూ సామ్సన్ తన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 42 బంతుల్లోనే 85 పరుగులు బాదాడు. స్మిత్ జౌట్ అయ్యాక తేవాటియా క్రీజ్‌లోని రావడం పలువురు అవాక్కయ్యారు. ఓ వైపు సామ్సన్ విజృంభణ కొనసాగుతున్న.. మరో బ్యాట్స్‌మెన్ రాహుల్ తేవాటియా మాత్రం పరుగులు సాధించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

    ఒక దశలో అతను చాలా బంతులు వృథా చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి 21 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు రాజస్థాన్ సాధించాల్సిన రన్‌రేట్ విపరీతంగా పెరిగింది. దీంతో అభిమానులు తేవాటియాను 4వ స్థానంలో అనవసరంగా బరిలో దించారని తిట్టుకున్నారు. అయితే ఆటగాళ్లు మాత్రం విశ్వాసం కోల్పోలేదు. తొలుత బంతులు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ తేవాటియా మెరుపు దాడితో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో 5 సిక్స్‌లు బాది అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇలా 31 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత తేవాటియా పెవిలియన్‌కు చేరగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అర్చర్ మూడు బంతుల్లోనే 13 పరుగులు చేసి మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరానికి చేర్చాడు. దీంతో 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసిన రాజస్తాన్.. 4 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.

    ఐపీఎల్‌లో ఇప్పటివరకు టాప్-5 సక్సెస్‌పుల్ చేజింగ్స్ ఇవే..
    224-రాజస్తాన రాయల్స్, ప్రత్యర్థి-కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 2020
    215-రాజస్తాన్ రాయల్స్, ప్రత్యర్థి- దక్కన్ చార్జర్స్-2008
    209-ఢిల్లీ కేపిటల్స్, ప్రత్యర్థి- గుజరాత్ లయన్స్-2017
    206- కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్రత్యర్థి- సన్ రైజర్స్ హైదరాబాద్-2014
    206- చెన్నై సూపర్ కింగ్స్, ప్రత్యర్థి- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-2018
    Published by:Sumanth Kanukula
    First published: