Home /News /ipl /

QUALIFIER 1 TWITTER IN AWE AFTER JASPRIT BUMRAH RECORDS HIS BEST T20 FIGURES VS DELHI CAPITALS SA

IPL 2020: అతడు బంతులేస్తే బాట్స్‌మెన్ సాగిలపడాల్సిందే.. వికెట్లు ఎగరాల్సిందే!

Jasprit Bumrah

Jasprit Bumrah

గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4/14, బౌల్ట్‌ 2/9 సూపర్ బౌలింగ్ చేశారు. ఒక దశలో వీరి దాటికి ఢిల్లీ కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ముఖ్యంగా బుమ్రా యార్కర్స్‌తో క్యాపిటల్స్‌ను బయపెట్టాడు.

    ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ సింహంలా గర్జిస్తోంది. ప్రత్యర్ధులపై అమాంతం విరుచుకుపడుతూ ఊపిరాడకుండా చెస్తోంది. తాజా ఢిల్లీపై ఘన విజయం సాధించి ఫైనల్‌ కూడా చేరింది. మరోసారి ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరించింది. బ్యాటింగ్,బౌలింగ్ ఇలా అన్ని విభాగాలలో బలంగా జట్టు ప్రత్యర్థిని మోకరిల్లేలా చేస్తుంది. మునపటి స్టార్‌లు ఈసారి ఆ జట్టులో లేకపోయిన విశేషంగా రాణిస్తోంది. జట్టుకు బ్యాటింగ్ బలం ఎప్పటినుంచో ఉన్న ఈ సారి బౌలింగ్‌లో కూడా సత్తా చాటుతోంది. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తు్న్నారు.





    గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4/14, బౌల్ట్‌ 2/9 సూపర్ బౌలింగ్ చేశారు. ఒక దశలో వీరి దాటికి ఢిల్లీ కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ముఖ్యంగా బుమ్రా యార్కర్స్‌తో క్యాపిటల్స్‌ను బయపెట్టాడు. 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.  ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ ఓ అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు. ఒక సీజన్‌లో అత్యధిక 27 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు.  న్యూజిలాండ్‌ పర్యటనలో, ఐపీఎల్ ఆరంభంలో ఆశించినంత మేర రాణించలేకపోయాడు. యార్కర్లతో బాట్స్‌మెన్లను తికమక పెట్టే బుమ్రా న్యూజిలాండ్‌ పర్యటనలో అంచనాలను అందుకోలేకపోయాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత లండన్‌లో వెన్నెముకకు చికిత్స చేయించుకున్న అతను బెంగళూరు జాతీయ శిక్షణ శిబిరంలో చేరాడు. అక్కడ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించి న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. 5 టీ20ల్లో 5 వికెట్లు, 2 టెస్టుల్లో 6 వికెట్లు,3 వన్డేల్లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసి నిరాశపరిచాడు. దీంతో ఆటతీరుపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి.

    ఆ సీరిస్ తర్వాత లాక్‌డౌన్‌ అమలు కావడంతో పేసర్‌కు సుదీర్ఘ విశ్రాంతి దొరికింది. ఆ సమయంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అతని అద్భుత ప్రదర్శనకు ఐపీఎల్ వేదిక మారింది. ఢిల్లీపై 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో భారత బౌలర్ల ప్రదర్శన విషయానికి వస్తే భువనేశ్వర్‌కుమార్‌ 2017లో 26 వికెట్లు తీయగా,భువనేశ్వర్‌కుమార్‌ 2017లో 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వారి రికార్డును బుమ్రా అధిగమించాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Jasprit Bumrah

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు