ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్ లో బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ ఆమెనే...! ఈ బాలీవుడ్ భామ హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా

క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చిన ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఓ సెన్సేషన్. ఆటతో పాటు గ్లామర్ కూడా ఈ గేమ్ సొంతం. ఇక బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?

news18
Updated: October 27, 2020, 11:10 AM IST
IPL 2020: ఐపీఎల్ లో బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ ఆమెనే...! ఈ బాలీవుడ్ భామ హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా
  • News18
  • Last Updated: October 27, 2020, 11:10 AM IST
  • Share this:
క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చిన ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఓ సెన్సేషన్. ఆటతో పాటు గ్లామర్ కూడా ఈ గేమ్ సొంతం. ఇక బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఐపీఎల్ పురుడుపోసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్న ఈ సుందరికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి మ్యాచ్ లోనూ ఆమె పంజాబ్ ను దగ్గరుండి ప్రోత్సహించే తీరుకు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పంజాబ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆటగాళ్లెవరైనా సిక్స్ లు కొడితేనో.. బౌలింగ్ లో వికెట్ తీసినప్పుడో ఆమె ఆ జట్టు ఆటగాళ్లను చీరప్ చేస్తుంటుంది. అయితే తాజాగా మరోసారి ఈ సొట్టబుగ్గలసుందరి ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.

గతంలో పంజాబ్ గెలిచినప్పుడు ఆటగాళ్లకు కిస్ లు ఇవ్వడం, వారిని హత్తుకోవడాలు ప్రీతిజింటాకు వివాదాలు కూడా తెచ్చిపెట్టాయి. అయితే ఈ బ్యూటీ వాటినేమీ పట్టించుకోలేదు. తాజాగా ఐపీఎల్ సందర్భంగా పంజాబ్ జట్టును చీరప్ చేస్తూ ఆమె ఇస్తున్న హావభావాలు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. శనివారం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో, సోమవారం కోల్ కతా మ్యాచ్ లోనూ ఆమె హావబావాలు నెటిజన్లను కొల్లగొట్టాయి.
ఇంకేం.. మన కుర్రకారు ఊరుకుంటారా...? ఒకప్పుడు తమ కలల సుందరిని ఊహించుకుంటూ ట్విట్టర్ లో అభినందనల మందారమాలలు వేస్తున్నారు. ఆమె ఫోటోలు షేర్ చేస్తూ.. ఐపీఎల్ లో బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతియే నంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె స్మైల్ కు ఫిదా అవుతున్నారు.

కాగా ఈ సీజన్ లో మొదట వరుసగా ఐదు మ్యాచ్ లు  ఓడిపోయిన పంజాబ్.. ఆశ్చర్యకరంగా వరుస విజయాలు సాధిస్తూ.. టైటిల్ బరిలో తానూ ఉన్నానని ప్రత్యర్థులకు చెప్పకనే చెబుతున్నది. ఈ క్రమంలో బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో ఇరగదీస్తున్నది. బ్యాటింగ్ లో ఆ జట్టుకు కెప్టెన్ రాహుల్, విధ్వంసకరుడు గేల్ లు అదిరిపోయే ఆరంభలిస్తున్నారు.

ట్విట్టర్ లో ప్రీతి జింటా హావభావాలపై రియాక్షన్లు చూడండి..Published by: Srinivas Munigala
First published: October 27, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading