
చివరకు ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగుల వద్ద ఔటై పెవిలియన్కు చేరాడు. సెంచరీకి ఒక్క అడుగు దూరంలో నిలిచి నిరాశగా వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ యువ టాలెంట్ ఇషాన్ కిషన్ జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఓటమి అంచున ఉన్న జట్టును ఇషాన్ తన విరోచిత పోరాటంతో గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళాడు.
ముంబై ఇండియన్స్ యువ టాలెంట్ ఇషాన్ కిషన్ జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఓటమి అంచున ఉన్న జట్టును ఇషాన్ తన విరోచిత పోరాటంతో గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబై ప్రారంభంలోనే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. టాప్ ఆర్డర్ విఫలమైంది. తరువాత పోలార్డ్తో కలిసి ఇషాన్ చేసిన పోరాటం వల్ల మ్యాచ్ టైగా ముగిసింది.
అయితే ముంబై ఓడినప్పటికి ఇషాన్ చేసిన పోరాటంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. చివరి 5 ఓవర్లలో పోలార్డ్తో కలిసి ఇషాన్ 69 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్లలో 19 పరుగులు చేయాల్సి ఉండగా ఉదాన వేసిన ఆ ఓవర్లో ఇషాన్ కిషన్ 2 సిక్సర్లుగా బాది ఔటయ్యారు. ఇక చివరి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. పొలార్డ్ ఫోర్ కొట్టి స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్ ‘టై’ అయింది. చివరికి సూపర్ ఓవర్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది.
పెవిలియన్లో కూర్చోని మ్యాచ్ చూసిన ఇషాన్ కళ్ళలో మ్యాచ్ ఓడమనే బాధ కనిపించింది. తన పోరాటం వృధా అయిందనే విచారం తన ముఖ కవళికలలో స్పష్టమైంది.
అలా దిగులుగా కూర్చున్న పోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ "మ్యాచ్ ఓడినా.. నీ పోరాటం గెలిచిందంటూ" ఇషాన్ ప్రశంసిస్తున్నారు
Published by:Rekulapally Saichand
First published:September 29, 2020, 16:52 IST