OUR ATTITUDE IN THE FIELD LET US DOWN SRH CAPTAIN WARNER SA
IPL 2020: ఇలా చేస్తే మ్యాచ్ గెలుస్తారా!.. ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్ ఘోర తప్పిదాలు
ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యా్చ్లో ఢిల్లీ గెలిచిందని చెప్పడం కంటే సన్‌రైజర్సే ఆ జట్టును గెలిపించదని చెప్పడం బెటరెమో!
ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే ఆ జట్టు కొంపముంచాయి.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యా్చ్లో ఢిల్లీ గెలిచిందని చెప్పడం కంటే సన్‌రైజర్సే ఆ జట్టును గెలిపించదని చెప్పడం బెటరెమో!
ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే ఆ జట్టు కొంపముంచాయి.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యా్చ్లో ఢిల్లీ గెలిచిందని చెప్పడం కంటే సన్‌రైజర్సే ఆ జట్టును గెలిపించదని చెప్పడం బెటరెమో! ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే ఆ జట్టు కొంపముంచాయి. ఒక్కటా..రెండా ఏకంగా నాలుగు తప్పిందాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు అవకాశాల్ని దెబ్బతీశాయి. ఫీల్డర్స్ చేసిన దారుణ తప్పిందాలు చూసి గ్రౌండ్లో ఉన్న వార్నర్, డకౌట్లో ఉన్న కోచ్ పెదవి విరిచారు. ఆరంభంలో చేసిన తప్పిందాల వల్ల శిఖర్ ధావన్,స్టాయినిస్ జారవిడిచా భారీ మూల్యం చేల్లించుకున్నారు.
ఈ కారణంగా ఓపెనర్స్ శిఖర్ ధావన్ (78: 50 బంతుల్లో 6x4, 2x6), స్టాయినిస్ (38: 27 బంతుల్లో 5x4, 1x6) చేలరేగి ఢిల్లీకి భారీ స్కోర్‌ను అందించారు. ఇక మరో బాట్స్మెన్ సిమ్రాన్ హిట్మెయర్ (42 నాటౌట్: 22 బంతుల్లో 4x4, 1x6) ఇచ్చిన క్యాచ్‌ను కూడా జారవిడిచారు. ఫలితంగా ఈ ముగ్గురూ బ్యాట్మెన్స్ బ్యాట్ ఝళిపించడంతో ఢిల్లీ 190 పరుగుల భారీ స్కోర్‌ను చేసింది. నిజానికి అబుదాబి లాంటి పెద్ద స్టేడియంలో ఇంత పెద్ద స్కోర్ చేయడం ఢిల్లీకి బాగా కలిసోచ్చింది. సన్‌రైజర్స్ లాంటి బౌలింగ్ బలం ఉన్న జట్టుపై ఢిల్లీ భారీ స్కోర్ నమోదు చేసిదంటే ఎస్అర్హెచ్ తప్పిందాలే కారణమని చేప్పాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్స్ నుంచి శుభరంభం దక్కింది. దీనికి కారణం వారి క్యాచ్‌లు వదిలేయడమే.. సందీప్ శర్మ వేసిన 3వ ఓవర్లో స్టాయినిస్ సిల్లీ మిడాన్ దిశగా ఓ షాట్ కొట్టాడు. అది షాట్ పిచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్ పక్కగా వెళ్ళింది. దాన్ని అందుకోవడంలో హోల్డర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత రెచ్చిపోయిన స్టాయినిస్ హోల్డర్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదిన స్టాయినిస్ ఢిల్లీకి పాజిటివ్ మైండ్ సెట్‌కు క్రియేట్ చేశాడు.
అలాగే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో సిమ్రాన్ హిట్మెయర్.. హోల్డర్ వేసిన యార్కర్ బంతిని కవర్స్ దిశగా ఆడాడు. అది కాస్త అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నదీమ్ ముందుగా పడింది. దాన్ని క్యాచ్‌గా మలచడంలో నదీమ్ విఫలమయ్యాడు. ఇక ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శిఖర్ ధావన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని రషీద్ ఖాన్ జారవిడిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో ధావన్ ఆడిన భారీ షాట్ బంతి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది. ఆ సులువైన క్యాచ్‌ని రషీద్ వదిలేశాడు. అలాగే తన బౌలింగ్‌లో ఓ అనవసపు త్రో విసిరి నాలుగు అదనంగా వచ్చేలా చేశాడు. ఇలాంటి తప్పిందాలే సన్‌రైజర్స్ కొంపముంచాయి. ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతోఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.