IPL 2020: కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌ను అతడు లాగేసుకుంటాడా..?

కేఎల్ రాహుల్ (Image:IPL)

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబరు 8న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబరు 10న ముంబై ఇండియన్స్‌ను ఢీకొడుతుంది.

 • Share this:
  IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. జట్టు విఫలమైనా.. అతడు మాత్రం అద్భుతంగా రాణించాడు. అందుకే టీమ్ ప్లేఆఫ్స్ వెళ్లనప్పటికీ.. ఆరెంజ్ క్యాప్‌ ఇప్పటికీ అతడి పేరుపైనే ఉంది. టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడి కేఎల్ రాహుల్.. 55.83 సగటుతో 670 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఇంకే బ్యాట్స్‌మెన్ 600లకు పైగా పరుగులు చేయలేదు. ఐతే పంజాబ్ లీగ్ దశలోనే నిష్క్రమించిడంతో.. కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌కు చెక్ పెట్టేందుకు ఇద్దరు బ్యాట్స్‌మెన్ రేస్‌లో ఉన్నారు. రానున్న మ్యాచ్‌ల్లో వారు రాణిస్తే.. ఆరెంజ్ క్యాప్ రాహుల్ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది.

  ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబరు 8న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబరు 10న ముంబై ఇండియన్స్‌ను ఢీకొడుతుంది. అంటే ప్రస్తుతం మూడు జట్లు మాత్రమే ఉన్నాయి. అందులో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్, DC ఓపెనర్ శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లో 2, 3 స్థానాల్లో ఉన్నారు.

  సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 546, ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ 525 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (670) నుంచి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకునేందుకు వార్నర్ 130 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక ధావన్ 145 పరుగులు వెనక ఉన్నాడు. ఐతే ఎలిమినేటర్ మ్యాచ్‌లో వార్నర్ బాగా రాణించి.. సన్‌రైజర్స్ గెలిస్తే..అతడికి ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది. ఒక వేళ ధావన్ కూడా రాణించి.. ఢిల్లీ గెలిస్తే.. అతడికి కూడా మరో అవకాశం లభిస్తుంది. మొత్తంగా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా రెండు మ్యాచ్‌లు ఆడుతారు. ఆ రెండు మ్యాచ్‌ల్లో ధాటిగా ఆడి పరుగుల వరద పారిస్తే.. కేఎల్ రాహుల్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు.

  ORANGE CAP:


  PURPLE CAP:

  కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్.. 42 సగటుతో 546 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 135.14గా ఉంది. టోర్నీలో వార్నర్ అత్యధిక స్కోర్ 85 నాటౌట్. ఇక శిఖర్ ధావన్ 14 మ్యాచ్‌ల్లో 43.75 సగటుతో 525 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ధావన్ స్ట్రైక్ రేట్ 144.23గా ఉంది. టోర్నీలో శిఖర్ ధావన్ అత్యధిక స్కోర్ 106 నాటౌట్. మరి వీరిద్దరిలో ఎవరైనా కేఎల్ రాహుల్ స్కోర్‌ని దాటేసి.. ఆరెంజ్ క్యాప్ సాధిస్తారా? లేదో చూడాలి.
  Published by:Shiva Kumar Addula
  First published: