IPL: వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు.. స్టార్ ప్లేయర్‌ను వద్దునుకున్న ధోనీ

మహేంద్రసింగ్ ధోనీ ఎంతటి మృదుస్వభావో అంతే ముక్కుసాటి మనిషి కూడా.. అందుకే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. ఆ వ్వవహార శైలితోనే టీమిండియాను శక్తివంతమైన టీంగా తయారుచేశాడు.

Rekulapally Saichand
Updated: August 3, 2020, 6:03 PM IST
IPL: వద్దు సార్‌.. అతడు జట్టును నాశనం చేస్తాడు.. స్టార్ ప్లేయర్‌ను వద్దునుకున్న ధోనీ
సీఎస్‌కే టీమ్
  • Share this:
మహేంద్రసింగ్ ధోనీ ఎంతటి మృదుస్వభావో అంతే ముక్కుసాటి మనిషి కూడా.. అందుకే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. ఆ వ్వవహార శైలితోనే టీమిండియాను శక్తివంతమైన టీంగా తయారుచేశాడు. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన బయటకు వచ్చింది. ఓ టాప్ ఆటగాడిని జట్టులోకి తీసుకుందామని చెన్నై సూపర్‌కింగ్స్ యజమాని శ్రీనివాసన్‌..ధోనీని కొరాడు. 'అతను వద్దు సార్‌.. వస్తే జట్టును నాశనం చేస్తాడు' అని శ్రీనివాసన్‌తో మొహం మీదే చెప్పాడట ధోనీ.

గ్రేట్‌ లేక్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన సెమినార్‌లో ఎన్‌ శ్రీనివాసన్‌ పలు విషయాలను వెల్లడించారు. సీఎస్‌కేలోకి ఓ స్టార్ ఆటగాడ్ని తీసుకుందామని నేను ధోనీనీ కొరాను . అతను గొప్ప ప్లేయర్ అయినా అతన్ని ధోనీ వద్దన్నాడు. "సార్ అతను జట్టులోకి వస్తే టీం నాశనం చేస్తాడు.. వద్దు "అన్నాడు. ఏ ఆటగాడైనా అంచనా వేయడంలో ధోనీ సమర్ధుడు. అతను ఓ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఏ అభిప్రాయానైనా నిక్కచ్చిగా చెప్పడం అతనికి అలవాటు "అంటూ ధోనీని ప్రశంసించాడు. నిబ్దతతో కూడిన నిర్ణయాలే మహిని తిరుగులేని నాయకుడిని చేసింది. సీఎస్‌కేను ముందుండి నడిపిస్తూ ఆ జట్టు మూడు టైటిళ్లు సాధించిపెట్టాడు. ధోనీకి ఇప్పటికి వరకు 10 సీజన్లు కెప్టెన్‌గా వ్వవహరించాడు.
Published by: Rekulapally Saichand
First published: August 3, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading