ఐపీఎల్ (IPL) 2021 సీజన్ ప్లేఆఫ్స్ (Playoffs) రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్లు చెలరేగిపోయారు. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లు మిగిలి ఉండగానే 8.2 ఓవర్లలో అలవోకగా లక్ష్యాన్ని ఛేధించింది. ఇషాన్ కిషన్ (Ishan Kishan) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 25 బంతుల్లో 50 పరుగులు (3 సిక్స్‌లు, 5 ఫోర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 22 పరుగులు, సూర్యకుమార్ 13 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫికర్ రెహ్మాన్, చేతన్ సకారియా తలో వికెట్ సాధించారు.
కౌల్టర్‌నైల్ విజృంభించడంతో..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ (batting) చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 90 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ టీమ్‌లో ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24: 19 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముంబై బౌలర్లలో కౌల్టర్ నైల్ (4/14), జేమ్స్ నీషమ్ (3/12), జస్ప్రీత్ బుమ్రా (2/14) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశారు.
Dominant display from @mipaltan! ? ?
The @ImRo45-led unit seal a comprehensive 8⃣-wicket win and registered their 6⃣th win of the #VIVOIPL. ? ? #VIVOIPL #RRvMI
Scorecard ? https://t.co/0oo7ML9bp2 pic.twitter.com/psjBCAI90R
— IndianPremierLeague (@IPL) October 5, 2021
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైశ్వాల్ (12: 9 బంతుల్లో 3x4) పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ.. నాలుగో ఓవర్లో టీమ్ స్కోరు 27 వద్ద యశస్వి ఔటవగా.. అనంతరం కొద్దిసేపటికే లూయిస్ కూడా ఔటైపోయాడు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ రాజస్థాన్ కోలుకోలేకపోయింది. కెప్టెన్ సంజు శాంసన్ (3), శివమ్ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్ (4), శ్రేయాస్ గోపాల్ (0), చేతన్ సకారియా (6) సింగిల్ డిజిట్‌కే వికెట్లు చేజార్చుకున్నారు.
డేవిడ్.. తేవాటియా బ్యాటింగ్‌తో..
అయితే.. మిడిల్ ఓవర్లలో కాసేపు ఓపికగా క్రీజులో నిలిచిన డేవిడ్ మిల్లర్ (15: 23 బంతుల్లో), రాహుల్ తెవాటియా (12: 20 బంతుల్లో).. రాజస్థాన్ టీమ్ (team) పరువు నిలిపే ప్రయత్నం చేశారు. కానీ.. ఇద్దరూ మరీ అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో.. రాజస్థాన్ దాదాపు 10 ఓవర్ల పాటు కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. చివరి ఓవర్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (8 నాటౌట్: 7 బంతుల్లో 1x5) ఒక సిక్స్ కొట్టడంతో.. 90 పరుగుల మార్క్‌నైనా అందుకోగలిగింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 8.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, Mumbai Indians, Rajasthan Royals