గంగూలీ అలా ఆలోచిస్తే నువ్వు ఎక్కడ ఉండేవాడివి?.. ధోనీపై శ్రీకాంత్ ఫైర్

ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ అపజాయల సంఖ్య పెరిగిపోతుంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొని ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.


Updated: October 20, 2020, 7:23 PM IST
గంగూలీ అలా ఆలోచిస్తే నువ్వు ఎక్కడ ఉండేవాడివి?.. ధోనీపై శ్రీకాంత్ ఫైర్
ఎంఎస్ ధోని
  • Share this:


ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ అపజాయల సంఖ్య పెరిగిపోతుంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొని ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. పది సార్లు ఫ్లే ఆఫ్ చేరిన జట్టు..మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం ఇలా ఆడడం ఏంటంటూ క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. చెన్నై ఓటములకు కారణం లేకపోలేదంటూ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ధోనీ నిర్ణయాలే జట్టు వైఫల్యం చెందడానికి కారణమైందని బాహటంగానే పెదవి విరుస్తున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు ఆడించి తగిన మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడుతున్నారు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ళు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.

యువ ఆటగాళ్ళకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ధోనీని అడగ్గా.. వారిలో స్పార్క్ కనిపించలేదని చేప్పాడు. " యంగ్ ఫ్లేయర్స్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శల్లో వాస్తవం ఉంది. అయితే వారిలో మేం అనుకున్నంత స్పార్క్ వారిలో కనిపించడం లేదు. ముందు జరిగే మ్యాచ్‌ల్లో వారికి అవకాశం ఇస్తే ఎలా ఆడుతారో చూడాలి". అంటూ ధోనీ చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గంగూలీ కూడా ధోనీలా ఆలోచిస్తే తనకు జట్టులో అవకాశం దక్కేదా? అంటూ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ బహిరంగానే ధోనీపై విమర్శలకు దిగారు. మరి ప్రస్తుతం జట్టులో ఆడుతున్న కేదార్ జాదవ్‌లో ఆ స్పార్క్ ఉందా? అంటూ ప్రశ్నించారు. ధోనీ వ్యాఖ్యలు విస్మయపరుస్తున్నాయి. అలాంటి గొప్ప క్రికెటర్ యువ ఆటగాళ్ల పట్ల చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. జట్టు ఎంపిక ఏమాత్రం ఆశాజనకంగా లేదు.  కీలకమైన మ్యాచ్‌లో యంగ్ క్రికెటర్ ఎన్ జగదీశన్‌ను కాదని కేదార్ జాదవ్‌ను ఎందుకు ఆడించారు. జగదీషన్‌లో ఆడే సత్తా ఉందంటూ ధోనీ మాటలపై అసహనం వ్యక్తం చేశారు.

ఇక సోమవారం అబుదాబి వేదకగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ మద్య జరిగిన బిగ్ ఫైట్‌లో రాజస్ధాన్ రాజస్థాన్ జట్టు అలవొకగా విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 126 పరుగులు టార్గెట్‌ను సులువుగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో చెన్నై ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.
Published by: Rekulapally Saichand
First published: October 20, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading