ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020:మేం అక్కడికి వెళ్ళి చేయాల్సింది చాలా ఉంది: రైనా

అందరి కంటే ముందుగా తామే యుఏఈలో అడుగుపెడుతామని ఇప్పుటీకే ప్రకటించిన చెన్నై ప్రాంచైజీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను ప్రారంభించింది. టీం మెనేజ్‌మెంటే కాదు ఆటగాళ్ళు కూడా దుబాయిలో అడుగుపెట్టాలని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.


Updated: August 4, 2020, 8:10 PM IST
IPL 2020:మేం అక్కడికి వెళ్ళి చేయాల్సింది చాలా ఉంది: రైనా
సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహించనున్నారు.
  • Share this:
ఎప్పుడెప్పుడు దుబాయ్‌లో అడుగుపెడుదామాని ఉవ్విళ్లూరుతోంది చెన్నై సూపర్‌కింగ్స్‌ టీం. అందరి కంటే ముందుగా తామే యుఏఈలో అడుగుపెడుతామని ఇప్పుటీకే ప్రకటించిన చెన్నై ప్రాంచైజీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను ప్రారంభించింది. టీం మెనేజ్‌మెంటే కాదు ఆటగాళ్ళు కూడా దుబాయిలో అడుగుపెట్టాలని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌కి వెళ్లేందుకు తామంతా ఆత్రుతతో ఉన్నట్లు సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అన్నాడు.

"యుఏఈ వెళ్ళి మేం చేయాల్పిన పనులు చాలా ఉన్నాయి. 18 -20 రోజుల ముందుగానే అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటాన్నాం. ముందే అక్కడి వెళ్ళడం మంచిది. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. లాక్ డౌన్ కారణంగా 4-5 నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి వెళ్ళితే మాలో మళ్ళీ మాలో క్రికెట్ మూడ్ వస్తోందన్నారు" రైనా

అలాగే చెన్నై ఆటగాళ్ళు ఇంటి దగ్గరే సాధన చేస్తున్నట్లు రైనా తెలిపారు. కెప్టెన్ ధోనీ కూడా ఇంటి వద్దే తీవ్రంగా సాధన చేస్తున్నాడని, ప్లాన్‌తోనే ప్లేయర్స్ అంతా ముందుకు వెళ్ళుతున్నట్లు వివరించాడు. ఈ ఐపీఎల్ దీపక్‌ చాహర్‌ ఆడుతున్నడని వెల్లడించాడు.
Published by: Rekulapally Saichand
First published: August 4, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading