హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL2020: ముందుగా దుబాయ్ వెళ్ళే జట్టు అదే.. చార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్ళనున్న టీం

IPL2020: ముందుగా దుబాయ్ వెళ్ళే జట్టు అదే.. చార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్ళనున్న టీం

క్రికెట్ ప్రియులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020కి ముహూర్తం ఖరారైంది. ( IPL TEAMS)

క్రికెట్ ప్రియులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020కి ముహూర్తం ఖరారైంది. ( IPL TEAMS)

యుఏఈ వేదికగా జరగబోయే IPL 2020 కోసం ఫ్రాంచైజీలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే టోర్నికి సంబంధించిన అన్ని అనుమతులు లభించాయి. ఇక ఆటగాళ్ళను అక్కడి తరలించడాని జట్టు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి.

  యుఏఈ వేదికగా జరగబోయే IPL 2020 కోసం ఫ్రాంచైజీలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే టోర్నికి సంబంధించిన అన్ని అనుమతులు లభించాయి. ఇక ఆటగాళ్ళను అక్కడి తరలించడాని జట్టు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అందరీ కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ అక్కడి వెళ్ళేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది. ఆగస్టు 12లోపు దుబాయ్ లో అడుగుపెట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి శిక్షణను మెుదలుపెట్టాలని సీఎస్‌కే టీం ఆలోచన.

  తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీం అదికారి ఒక్కరు మాట్లాడుతూ "ఆగస్టు 8 కల్లా జట్టును దుబాయ్‌కి తరలించాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ నెల రెండో వారంలో ట్రైనింగ్ క్యాంప్ మెుదలుపెడుతాం. బీసీసీఐ.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) విడుదల చేసిన వెంటనే ట్రావెల్ ప్లాన్‌ను సిద్దం చేసుకుంటాం. టీం మెుత్తాన్ని చార్టెడ్ ఫ్లైట్‌లోనే దుబాయ్ తీసుకెళ్లాడానికి ప్రయత్నాలు మెుదలుపెట్టామన్నారు".

  ఇక మిగితా ఫ్రాంచైజీలు కూడా వారి టీంలను త్వరలోనే దుబాయ్ తరిలించడానికి ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. సెప్టెంబర్ లోపు దాదాపు అన్ని జట్లు దుబాయికి చేరుకుంటాయి. మెుదటి వారంలో సాదన మెుదలుపెట్టానున్నాయి. ఐపీఎల్ 13వ ఎడిషన్ సంబంధించిన చకచక జరిగిపోతున్నాయి. ఆగస్టు 3న ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లోనే షెడ్యూల్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Bcci, Dubai, IPL 2020, Ms dhoni

  ఉత్తమ కథలు