MS Dhoni New Look | ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన జార్ఖండ్ డైనమైట్

సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 టోర్నీ ప్రారంభంకానుండగా...ఎంఎస్ ధోనీ సీఎస్కే జట్టుకు సారథ్యంవహించనున్నాడు. 14 మాసాల విరామం తర్వాత ధోనీ ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: August 2, 2020, 8:17 PM IST
MS Dhoni New Look | ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన జార్ఖండ్ డైనమైట్
మహేంద్ర సింగ్ ధోనీ(ఫైల్ ఫోటో)
  • Share this:
గత ఏడాది కాలంగా క్రికెట్‌‌కు దూరంగా ఉన్నా...ఎంఎస్ ధోనీకి క్రికెట్ ఫ్యాన్స్ మధ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో నిత్యం జార్ఖండ్ డైనమైట్‌ని కాశానికెత్తేస్తూనే ఉన్నారు ఆయన ఫ్యాన్స్. మునుపటి షెడ్యూల్ మేరకు ఏప్రిల్-మే మాసంలో జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ కోసం ధోనీ సన్నద్ధమయ్యాడు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ టోర్నీని బీసీసీఐ వాయిదావేయడంతో ధోనీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్‌లో ప్రారంభంకానున్న 13వ ఐపీఎల్‌ 2020 టోర్నీలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు ఈ దిగ్గజ ఆటగాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యంవహించనున్నాడు. గత 14 మాసాలుగా ధోనీ క్రికెట్‌ మ్యాచ్‌లకు9 దూరంగా ఉంటున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ధోనీ...మైదానంలోకి వస్తుండటంతో అతని ఆటను ఆశ్వాదించేందుకు ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. న్యూ లుక్‌లో ధోనీ అదరగొడుతున్నాడు. షార్ట్ తలవెంట్రుకలు, గడ్డం లేకుండా కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ధోనీకి సంబంధించిన ఫోటోలను తరచూ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తూ...ఫ్యాన్స్‌లో క్రేజ్ పెంచుతోంది సీఎస్‌కే.





ఐపీఎల్ 2020 టోర్నీని సెప్టెంబర్ 19 నుంచి నవంబరు 8 వరకు దుబాయ్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టోర్నీకి ముందుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణాశిబిరాలు నిర్వహించనున్నాయి. ఈ నెల రెండో వారంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు దుబాయ్‌కి చేరుకోనున్నారు. కరోనా నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను ఎవరినీ ధోనీ దుబాయ్‌కి తీసుకెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో ధోనీకి దాదాపు నాలుగు మాసాల ఎడబాటు ఏర్పడనుంది.
Published by: Janardhan V
First published: August 2, 2020, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading