ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ధోనీ అప్పటివరకు చెన్నై కెప్టెనే


Updated: August 12, 2020, 10:49 AM IST
IPL 2020:  సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ధోనీ అప్పటివరకు చెన్నై కెప్టెనే
సీఎస్‌కే టీమ్
  • Share this:
ఐపీఎల్ 2020 సందడి మొదలైంది. టోర్నీ నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమాతులు ఇప్పటికే బీసీసీఐకి లబించాయి. త్వరలో టీమ్స్ అన్ని యూఏఈకి దారి పట్టనున్నాయి. అందరి కంటే ముందుగా సీఎస్కే టీం దుబాయ్ చేరనుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్ట్ 21న యూఏఈకి పయనం కానుంది.

అయితే యుఏఈ వెళ్లే ముందు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్లేయర్స్‌కు ట్రైనింగ్ క్యాంప్‌ నిర్వహించనుంది జట్టు యాజమాన్యం. ఆగస్ట్ 16లోపు టీం సభ్యులు అందరూ చెన్నైకి చేరుకునే అవకాశం ఉందని ఆ టీం సీఈవో కాశీ విశ్వనాథన్ మీడియాకు తెలిపారు. అలాగే ధోనీ 2022 వరకు కెప్టెన్‌గా ఉంటారన్నారు.  కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ ఎట్టికేలకు యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. అబుదాబి, షార్జా, దుబాయ్‌లోని స్టేడియాలలో ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుంది.
Published by: Rekulapally Saichand
First published: August 12, 2020, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading