news18-telugu
Updated: November 7, 2020, 10:36 PM IST
ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 2020 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవడంతో.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాట్స్‌మెన్‌గానూ.. విఫలమయ్యాడని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ఐపీఎల్ నుంచి కూడా తప్పుకునే సమయం ఆసన్నమయిందని.. రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ కొందరు మాత్రం ధోనీని వెనకేసుకొచ్చారు. ఒక్క ఐపీఎల్లో రాణించనంత మాత్రన ఇంతలా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదని.. అతడు ఒక లెజెండ్ అని ప్రశంసలు కురిపించారు. సింహం ఎప్పటికీ సింహమేనని అభిప్రాయపడ్డారు.
సీన్ కట్ చేస్తే.. నవంబరు 7న రాత్రి ట్విటర్లో #DhoniForLife అనే ట్వీట్ ఇండియా వైడ్ ట్రెండింగ్‌లోకి వెళ్లింది. నెటిజన్లు ధోనీకి మద్దతుగా ట్వీట్ల మోత మోగించారు. టీమిండియా తరపున ధోనీ సాధించిన విజయాలు, వికెట్ కీపింగ్‌లో రికార్డులు, ఐపీఎల్లో అందుకున్న మైలురాళ్లు.. ఇలా ఎన్నో అంశాలను ట్వీట్స్ చేశారు. క్రికెట్‌తో పాటు వ్యక్తిగత విషయాల్లోనూ.. ధోనీ ఘనతను పొగుడుతూ పోస్ట్‌లు పెట్టారు. మరి ఇదంతా ఎందుకో ఏమో గానీ.. ట్విటర్‌ను షేక్ చేశారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.
కాగా, ఐపీఎల్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 6 మ్యాచ్‌లో గెలిచి.. మరో ఎనిమిదింట ఓటమి పాలయింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక ధోనీ విషయానికొస్తే.. 14 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 200 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అత్యధిక స్కోరు 47 నాటౌట్. ఐతే ఇదే ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఖచ్చితంగా కాదు.. వచ్చే సీజన్ కూడా ఆడుతానని స్పష్టం చేశాడు ఎంఎస్ ధోనీ.
Published by:
Shiva Kumar Addula
First published:
November 7, 2020, 10:28 PM IST