MISMANAGEMENT FROM BCCI VIRENDER SEHWAG SLAMS CRICKET BOARD ON ROHIT SHARMAS INJURY CONTROVERSY SK
IPL 2020: బీసీసీఐపై సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం.. ఈ ఏడాది అన్నీ వింతలే..
వీరేంద్ర సెహ్వాగ్
రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఘాటు విమర్శలు గుప్పించారు వీరేంద్ర సెహ్వాగ్. రోహిత్ పరిస్థితి ఏంటో తనకు తెలియదని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అని మండిపడ్డారు.
భారత క్రికెట్లో కొన్ని రోజులుగా రోహిత్ శర్మ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా టూర్‌కు అతడిని ఎంపిక చేయకపోవడంపై దుమారం రేగుతోంది. చిన్నపాటి గాయానికే హిట్‌మ్యాన్‌ను ఎలా పక్కనబెడతారు? గాయం నుంచి కోలుకొని ఐపీఎల్లో మళ్లీ ఆడుతున్నాడు కదా.. మీరెందుకు సెలెక్ట్ చేయలేదు? అంటూ ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేరారు. రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. రోహిత్ పరిస్థితి ఏంటో తనకు తెలియదని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదగా ఉన్నాయని మండిపడ్డారు వీరూ.
'' రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సెలక్షన్ కమిటీలో ఆయన భాగం కానప్పటికీ.. సెలెక్షన్‌కు రెండు మూడు రోజుల ముందైనా కోచ్ అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన్నుంచి కొన్ని సూచనలు స్వీకరిస్తారు. రోహిత్ గాయపడితే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. అలా జరగలేదు. రోహిత్‌నూ జట్టులోకి తీసుకోలేదు. ఇదేంటే నాకర్థం కావడం లేదు. ఈ ఏడాది అన్ని వింతలే జరుగుతున్నాయి. హైదరాబాద్‌పై రోహిత్ శర్మ ఆడాడు. ప్లేఆఫ్స్ కూడా ఆడతాడు. తాను బాగానే ఉన్నానని చెబుతున్నాడు. అలాంటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయలేదు.'' అని బీసీసీఐకి ప్రశ్నించారు సెహ్వాగ్. Cricbuzzతో పాటు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు సెహ్వాగ్. బీసీసీఐ వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోందని.. ఐపీఎల్ బాగానే ఆడుతున్న రోహిత్‌ను, జాతీయ జట్టులోకీ తీసుకోవచ్చు కదా.. అని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఐపీఎల్లో ఆడే అంశంపై పరిణతితో ఆలోచించాలని ఇటీవల రోహిత్ శర్మనుద్దేశించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్లేఆఫ్స్ కోసం రోహిత్ చేస్తున్న కసరత్తులపై స్పందించిన ఆయన.. ఒక్క లీగ్ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని చెప్పారు. గాయం కారణంగానే ఆస్ట్రేలియాకు టూర్‌కు ఎంపిక చేయలేదని.. కానీ దాన్ని పక్కనబెట్టి రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడని వాపోయారు గంగూలీ. రోహిత్‌లాంటి స్టార్ క్రికెటర్‌ను కాపాడుకోవడం, తిరిగి ఆడేలా చూసుకోవడమనేది పూర్తిగా బీసీసీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. కానీ ఇవేమీ పట్టించుకోని రోహిత్ శర్మ.. మంగళవారం హైదరాబాద్‌పై మ్యాచ్ ఆడాడు.
POINTS TABLE:
SCHEDULE TIME TABLE:
ORANGE CAP:
ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిన ముంబై టీమ్‌కు.. హైదరాబాద్ మ్యాచ్ పెద్దగా ముఖ్యం కాదు. కానీ ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఆ మ్యాచ్‌లో ఆడి తీవ్ర చర్చకు తెరలేపాడు రోహిత్ శర్మ. టాస్ సమయంలో మాట్లాడుతూ...తాను ఫిట్‌గా ఉన్నానని, చురుగ్గానే ఉన్నానని స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న గాయాన్ని పెద్దగా చూపించి ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్‌ను కావాలనే ఎంపిక చేయలేదా? బీసీసీఐ తీరుకు నిరసనగానే హైదరాబాద్ మ్యాచ్‌లో కావాలని రోహిత్ శర్మ ఆడాడా? అని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.