HOME »NEWS » »mi vs dc netizens praises ravichandran ashwin spell in qualifier 1 match sk

MI vs DC: అదిరిందయ్యా అశ్విన్.. క్యారమ్ బాల్స్‌తో మ్యాజిక్.. 3 వికెట్స్ ఫట్

MI vs DC: అదిరిందయ్యా అశ్విన్.. క్యారమ్ బాల్స్‌తో మ్యాజిక్.. 3 వికెట్స్ ఫట్
రవిచంద్రన్ అశ్విన్ (Image:DC)

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్..7.50 ఎకనామీతో 13 వికెట్లు పడగొట్టాడు.

  • Share this:
    MI vs DC: కీలకమైన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. అద్భుతమైన స్పెల్‌తో ముంబై డేంజరస్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ను పంపించాడు. మూడు వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ దూకుడుకు కళ్లెం వేశాడు. లేదంటే రోహిత్ సేన ఇంకా భారీగా స్కోర్ చేసి ఉండేది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అశ్విన్..29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, పొలార్డ్‌ను డకౌట్ చేయడంతో పాటు అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన డికాక్‌ను ఔట్ చేశాడు. రెండో ఓవర్లో రోహిత్ శర్మను ఎల్‌బీడబ్ల్యూ రూపంలో బోల్తాకొట్టించి.. 8వ ఓవర్లలో డికాక్‌ వికెట్ తీశాడు. ఒక 13వ ఓవర్లలో అశ్విన్ వేసిన క్యారమ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు పొలార్డ్.

    అశ్విన్ స్పెల్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా అశ్విన్ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు.





    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్..7.50 ఎకనామీతో 13 వికెట్లు పడగొట్టాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:November 05, 2020, 21:00 IST

    टॉप स्टोरीज