ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Final, MI vs DC: టైటిల్ ఫైట్.. టాస్ గెలిచిన శ్రేయస్.. ఢిల్లీ బ్యాటింగ్

IPL 2020 Final, MI vs DC: టైటిల్ కోసం (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫైట్ చేస్తున్నాయి. దుబాయ్ వేదికగా పంతం.. నీదా నాదా..సై.. అన్నట్లుగా తలపడుతున్నాయి. ముంబై టీమ్ ఐదోసారి టైటిల్ గెలుపుపై కన్నేయగా.. తొలిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.

news18-telugu
Updated: November 10, 2020, 7:10 PM IST
IPL 2020 Final, MI vs DC: టైటిల్ ఫైట్.. టాస్ గెలిచిన శ్రేయస్.. ఢిల్లీ బ్యాటింగ్
రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (Image:IPL)
  • Share this:
MI vs DC Final, IPL 2020: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐపీఎల్‌లో అంతిమ సమరం జరుగుతోంది. టైటిల్ కోసం (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫైట్ చేస్తున్నాయి. దుబాయ్ వేదికగా పంతం.. నీదా నాదా..సై.. అన్నట్లుగా తలపడుతున్నాయి. ముంబై టీమ్ ఐదోసారి టైటిల్ గెలుపుపై కన్నేయగా.. తొలిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. పాయింట్ల పట్టికలో టాపర్లుగా నిలిచిన ఈ బ్లూ టీమ్స్ పోరు పోరు ఉత్కంఠ రేపుతోంది. అంతటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ముంబై టీమ్ మాత్రం ఒకే ఒక్క మార్పు చేసింది. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.


జట్ల వివరాలు:

Mumbai Indians (Playing XI): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కల్టర్‌నైల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.

Delhi Capitals (Playing XI): మార్కుస్ స్టోనియిస్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మెయిర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబడ, ప్రవీణ్ దుబే, అన్రిచ్ నార్జీ.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే మూడు సార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో రెండు సార్లు, క్వాలిఫైయర్‌లో ఒకసారి పోటీపడ్డాయి. ఈ మూడింటిలోనూ ముంబై ఇండియన్స్ జట్టే గెలిచింది.

అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబరు 5న జరిగిన క్వాలిఫైయర్-1లోనూ ఢిల్లీని ఓడించింది. 57 పరుగుల తేడాతో భారీవిజయం సాధించి.. ఫైనల్‌లో అడుగుపెట్టింది ముంబై ఇండియన్స్.

ఐతే ఐపీఎల్-2020 టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. ఒక్కసారి కూడా ఢిల్లీ గెలవలేదు. అదే ఊపుతో మరోసారి ఢిల్లీని ఓడించి టైటిల్ గెలవాలని ముంబై భావిస్తోంది. పక్కా ప్రణాళికతో క్వాలిఫైయర్-2లో హైదరాబాద్‌ను ఓడించినట్లుగానే.. ముంబైని కూడా దెబ్బకొట్టి..తొలిసారి కప్పును ముద్దాడాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: November 10, 2020, 7:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading