ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Final, MI vs DC: ఆదుకున్న పంత్, శ్రేయస్.. ఢిల్లీ డీసెంట్ స్కోర్

IPL 2020 Final, MI vs DC: ఢిల్లీ టీమ్..ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందులు పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ మార్కుస్ స్టోయినిస్ తొలి ఓవర్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. క్వాలిఫైయర్-2లో అద్భుతంగా ఆడిన అతడు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అట్టర్ ఫ్లాపయ్యాడు.

news18-telugu
Updated: November 10, 2020, 9:19 PM IST
IPL 2020 Final, MI vs DC: ఆదుకున్న పంత్, శ్రేయస్.. ఢిల్లీ డీసెంట్ స్కోర్
శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (Image;iIPL)
  • Share this:
MI vs DC Final, IPL 2020: ఐపీఎల్ 2020 టైటిల్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) డీసెంట్ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటకి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ 64 (50 బంతుల్లో), రిషభ్ పంత్ 56 (38 బంతుల్లో) రన్స్ చేశారు. స్టోయినిస్ 0, ధావన్ 15, రహానే 2, హెట్‌మెయిర్ 5, అక్షర్ పటేల్ 9 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు.

ఢిల్లీ టీమ్..ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందులు పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ మార్కుస్ స్టోయినిస్ తొలి ఓవర్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. క్వాలిఫైయర్-2లో అద్భుతంగా ఆడిన అతడు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అట్టర్ ఫ్లాపయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్‌కు ఇచ్చి వెను దిరిగాడు. ఆ తర్వాత కూడా ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో రహానే, నాలుగో ఓవర్‌లో ధావన్ ఔట్ అయ్యారు. అలా తొలి 4 ఓవర్లో కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ. ఐతే పంత్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. నాలుగో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఐతే 15వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి పంత్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన.. హెట్‌మెయిర్ మెరుపులు మెరిపిస్తాడనుకుంటే 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు వెళ్లాడు. అక్షర్ పటేల్ కూడా 9 రన్స్‌కే వెనుదిరిగాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కల్టర్‌నైల్ రెండు వికెట్లు తీశాడు.


ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే మూడు సార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో రెండు సార్లు, క్వాలిఫైయర్‌లో ఒకసారి పోటీపడ్డాయి. ఈ మూడింటిలోనూ ముంబై ఇండియన్స్ జట్టే గెలిచింది.

అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబరు 5న జరిగిన క్వాలిఫైయర్-1లోనూ ఢిల్లీని ఓడించింది. 57 పరుగుల తేడాతో భారీవిజయం సాధించి.. ఫైనల్‌లో అడుగుపెట్టింది ముంబై ఇండియన్స్.

ఐతే ఐపీఎల్-2020 టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. ఒక్కసారి కూడా ఢిల్లీ గెలవలేదు. అదే ఊపుతో మరోసారి ఢిల్లీని ఓడించి టైటిల్ గెలవాలని ముంబై భావిస్తోంది. పక్కా ప్రణాళికతో క్వాలిఫైయర్-2లో హైదరాబాద్‌ను ఓడించినట్లుగానే.. ముంబైని కూడా దెబ్బకొట్టి.. తొలిసారి కప్పును ముద్దాడాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: November 10, 2020, 9:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading