• HOME
 • »
 • NEWS
 • »
 • IPL
 • »
 • MI VS DC FINAL IPL 2020 MUMBAI INDIANS VS DELHI CAPITALS PLAYING 11 IPL PLAYOFFS LIVE SCORECARD SK

MI vs DC Final, IPL 2020: నువ్వా..? నేనా..? టైటిల్ పోరులో గెలుపెవరిది?

MI vs DC Final, IPL 2020: నువ్వా..? నేనా..? టైటిల్ పోరులో గెలుపెవరిది?

రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (Image:IPL)

MI vs DC Final, IPL 2020: ఈ టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. ఒక్కసారి కూడా ఢిల్లీ గెలవలేదు. అదే ఊపుతో మరోసారి ఢిల్లీని ఓడించి టైటిల్ గెవాలని ముంబై భావిస్తోంది. పక్కా ప్రణాళికతో క్వాలిఫైయర్-2లో హైదరాబాద్‌ను ఓడించినట్లుగానే ముంబైని దెబ్బకొట్టి..తొలిసారి కప్పును ముద్దాడాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతోంది.

 • Share this:
  MI vs DC Final, IPL 2020: ఐపీఎల్‌-2020లో అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా టైటిల్ కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఢీకొనబోతున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లే అగ్రస్థానాల్లో ఉన్నాయి. మరి టాపర్స్ పోరులో ఎవరు గెలిచి ఛాంపియన్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఐతే ఈ టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. ఒక్కసారి కూడా ఢిల్లీ గెలవలేదు. అదే ఊపుతో మరోసారి ఢిల్లీని ఓడించి టైటిల్ గెలవాలని ముంబై భావిస్తోంది. పక్కా  ప్రణాళికతో క్వాలిఫైయర్-2లో హైదరాబాద్‌ను ఓడించినట్లుగానే.. ముంబైని కూడా దెబ్బకొట్టి..తొలిసారి కప్పును ముద్దాడాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతోంది.

  ముఖా ముఖి పోరు:
  ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే మూడు సార్లు తలపడ్డాయి.  గ్రూప్ దశలో రెండు సార్లు, క్వాలిఫైయర్‌లో ఒకసారి పోటీపడ్డాయి. ఈ మూడింటిలోనూ ముంబై ఇండియన్స్ జట్టే గెలిచింది.

  అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.  నవంబరు 5న జరిగిన క్వాలిఫైయర్-1లోనూ ఢిల్లీని ఓడించింది. 57 పరుగుల తేడాతో  భారీవిజయం సాధించి.. ఫైనల్‌లో అడుగుపెట్టింది ముంబై ఇండియన్స్.

  బలాబలాలు:
  ఇరు జట్లలో ముంబై టీమ్ బలంగా కనిపిస్తుంది. డికాక్, రోహిత్, సూర్య, ఇషాన్ రూపంలో శక్తివంతమైన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక పొలార్డ్, హార్దిక్ పాండ్యా వంటి పవర్ ఫుల్ హిట్టర్‌లు ఉన్నారు. బుమ్రా, బౌల్ట్ రూపంలో ప్రత్యర్థులను దెబ్బకొట్టే బలమైన బౌలర్లు ఉన్నారు. ముంబైకి డికాక్, రోహిత్ శుభారంభం చేస్తే..ఆఖరులో పొలార్డ్, హార్దిక్ మెరుపులు మెరిపిస్తే.. జట్టు భారీ స్కోర్ చేసే అవకాశముంది. ప్రతి మ్యాచ్‌లోనూ బంతితో ప్రత్యర్థులను దెబ్బతీసే బుమ్రా, బౌల్ట్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగితే.. ఢిల్లీకి ఇబ్బందులు తప్పవు.

  ధావన్ ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. డీసీ బ్యాట్స్‌మెన్‌లో ఆడితే అందరూ బాగా ఆడుతారు. లేదంటే అందరూ అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఇదే పెద్ద మైనస్. ఐతే గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి సక్సెస్ అయింది. స్టోయినిస్ ఓపెనింగ్‌లో వచ్చి అదరగొట్టాడు. హెట్‌మెయిర్ కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి మంచి స్కోర్ చేశాడు. ఇవాళ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశముంది. గత మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ చెలరేగితే ఢిల్లీ కూడా భారీ స్కోర్ చేయగలదు. బౌలింగ్‌లోనూ నార్జీ, రబడ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిద్దరు ముంబైని ప్రారంభంలోనే దెబ్బకొడితే.. ఢిల్లీకి ప్లస్ అవుతుంది. ఐతే ఇరు జట్లలోనూ భారీ హిట్టర్‌లు, పవర్ ఫుల్ బౌలర్లు ఉండడంతో.. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది.

  పిచ్ కండిషన్:
  దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డ్యూ ఫ్యాక్టర్ కీలక భూమిక పోషించే అవకాశముంది. గత మ్యాచ్‌ల్లో ఇప్పటికే రుజువయింది. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ప్లేఆఫ్స్‌లో టాస్ గెలిచిన జట్లే భారీ స్కోర్ సాధించి.. విజయం సాధించాయన్న విషయం తెలిసిందే.

  చేధన జట్ల విజయాలు:
  ఈ గ్రౌండ్‌లో ఛేజింగ్ టీమ్ 2 సార్లు గెలవగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

  జట్ల అంచనా:

  ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కల్టర్ నైల్, రాహుల్ చాహర్, జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్/జేమ్స్ ప్యాటిన్సన్.

  ఢిల్లీ క్యాపిటల్స్: మార్కుస్ స్టోయినిస్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, రవి అశ్విన్, హర్షల్ పటేల్, అన్రిచ్ నార్జీ, కాగిసో రబడ.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు