HOME »NEWS » »mh vs dc ipl 2020 final mumbai indians contest pick wrong gun win gift contest ahead of final sk

MI vs DC, IPL 2020 Final: ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చెబితే.. అద్భుతమైన గిఫ్ట్ మీ సొంతం..

MI vs DC, IPL 2020 Final: ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చెబితే.. అద్భుతమైన గిఫ్ట్ మీ సొంతం..
ముంబై ఇండియన్స్ కాంటెస్ట్

సరైన సమాధానం చెప్పిన లక్కీ నెటిజన్లకు ఉషా కంపెనీకి చెందిన OTG (ఓవెన్-టోస్ట్-గ్రిల్) బహుమతిగా అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ 2020 ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీలో తుది సమరం మంగళవారం రాత్రి జరగనుంది. దుబాయ్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను తొలిసారి ఫైనల్ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టనుంది. ఐతే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియా కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఢిల్లీ వర్సెస్ ముంబై‌కి సంబంధించి ఫ్యాన్స్‌కు క్రికెట్ ప్రశ్నలు సంధించింది. దానికి సరైన సమాధానం చెబితే.. అద్భుతమైన గిఫ్ట్ ఇస్తామని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నెటిజన్లు ఆన్సర్ చెప్పి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    ఈ మూడింటలో ఒక తప్పు స్టేట్‌మెంట్ ఉంది. అందేంటో చెప్పాల్సి ఉంటుంది.



    A. ఢిల్లీపై కీరన్ పొలార్డ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 74.

    B. ఢిల్లీ vs ముంబై మ్యాచ్‌లో ఒక ఇన్సింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ కృనాల్ పాండ్యా

    C. ఢిల్లీ క్యాపిటల్స్‌పై జాస్ప్రిత్ బుమ్రా వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 4/14


    సరైన సమాధానం చెప్పిన లక్కీ నెటిజన్లకు ఉషా కంపెనీకి చెందిన OTG (ఓవెన్-టోస్ట్-గ్రిల్) బహుమతిగా అందిస్తారు.

    ఇంకెందుకు ఆలస్యం మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఐతే ఆన్సర్ ట్వీట్ చేసేముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోండి.
    Published by:Shiva Kumar Addula
    First published:November 09, 2020, 19:41 IST