Updated: November 11, 2020, 2:37 PM IST
gujarath lions
అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువగా మజాను ఇచ్చిన ఐపీఎల్ 2020 ముగిసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా బీసీసీఐ.. దుబాయ్ వేదికగా విజయవంతంగా కొనసాగించింది. మరో ఆరు నెలల్లో ఐపీఎల్ 2021 నిర్వహణకు ప్లాన్ చేస్తుంది బీసీసీఐ. టొర్నీ ముందు పూర్తి స్థాయిలో వేలం జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలిస్తుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు బోర్డు సూచనలు ఇచ్చింది.
అలాగే బీసీసీఐ మరో కీలక విషయంపై చర్చిస్తోంది. వచ్చే ఏడాది కొత్త జట్టును టోర్నీలోకి తీసుకురావాలని చూస్తోంది. కొత్తగా గుజరాత్ ఫ్రాంఛైజీ టోర్నీలో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు 8 జట్లు ఐపీఎల్లో ఆడుతూ ఉండగా.. 9 జట్టుగా గుజరాత్ ఆడనుంది వచ్చే ఏడాది కొత్తగా మరో జట్టు ఐపీఎల్ బరిలో దిగే అవకాశం ఉంది. 9వ జట్టుగా గుజరాత్ ఆడనుంది. 2021 ప్రారంభంలో కొత్త జట్టు వేలానికి బీసీసీఐ సన్నద్ధం అవుతోంది. అహ్మదాబాద్ బేస్డ్గా ఆ టీంకు నామకారణం చేయనున్నారు. ఆ టీంను సొంతం చేసుకోవడానికి ఓ భారీ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
గతంలో గుజరాత్ లయన్స్ జట్టు 2016, 2017 సీజన్లలో ఐపీఎల్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధం వేటు పడడంతో...గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ జట్లు ఐపీఎల్ అడుగుపెట్టాయి. గుజరాత్ లయన్స్‌కు సురేశ్ రైనా నాయకత్వం వహించారు. రాజ్‌కోట్ వేదికగా ఈ టీం ఐపీఎల్ ఆడింది.
ఐపీఎల్ 2020లో ముంబై మరోసారి విజయం సాదించింది. ఈ విక్టరీతో ఐదో సారి టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై మొదటి నుంచీ ఆఖరు వరకు దూకుడు కొనసాగించింది. ఇటు బ్యాట్.. అటు బాల్‌తో రాణించి.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలిసారి ఫైనల్‌కు వచ్చిన ఢిల్లీని ఓడించి... ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంది ముంబై. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఐపీఎల్లో తమకు ఎదురే లేదని మరోసారి నిరూపించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన.
Published by:
Rekulapally Saichand
First published:
November 11, 2020, 1:36 PM IST