IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి టోర్నీలో ఆమె కనిపించదట!

ఇది అభిమానులను కొంత నిరాశపరిచే వార్త. తన అందంతో,మాటలతో అభిమానులను అలరించే యాంకర్ మాయంతి లాంగర్ ఐపీఎల్ 2020 ఎడిషన్‌లో కనిపించారు.


Updated: September 18, 2020, 5:01 PM IST
IPL 2020: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి టోర్నీలో ఆమె కనిపించదట!
Mayanti Lange
  • Share this:
ఇది అభిమానులను కొంత నిరాశపరిచే వార్త. తన అందంతో,మాటలతో అభిమానులను అలరించే యాంకర్ మాయంతి లాంగర్ ఐపీఎల్ 2020 ఎడిషన్‌లో కనిపించారు. ఈ ఐపీఎల్‌ నుంచి మాయంతి లాంగర్ తప్పించినట్లు లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాత ద్వారా తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌కు యాంకర్లుగా వ్యవహరించే వారి జాబితాను తాజాగా విడుదల చేసిన స్టార్ అందులో మాయంతి పేరును చేర్చాలేదు.

ఐపీఎల్ అంటే కేవలం ఆటే కాదు గ్లామర్ గేమ్ కూడా .. తెర ముందు కనిపించే ప్రతి విషయాని గ్లామర్ చూపించడంలో స్టార్ ఎప్పుడు వెనుకాడదు. చీర్ గర్ల్స్ మెుదలకుని యాంకర్ల వరకు టోర్నీలో ప్రతిది ఆకర్షణనీయంగా కనిపిస్తోంది. అలాంటి ఈవెంట్‌లో మాయంతిలాంటి అందమైన యాంకర్‌ను తప్పించడం కొంత నిరాశపరిచే ఆంశమే. ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా విడుదల చేసిన యాంకర్‌ జాబితలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. మయాంతి ఎందుకు ఈ టోర్నీలో యాంకర్‌గా వ్వవహరించడం లేదని దానిపై ఇంకా స్పష్టత లేదు. వ్యక్తిగత కారణాల వల్లనా లేక స్టార్ స్పోర్ట్స్‌ యాజమాన్యమే తప్పించిందా అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.




గ్లామర్ ప్రజెంటర్‌గా స్టార్ తెర ముందు ఆకర్షణియంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరించేది మయాంతి. డ్రెస్సింగ్‌తో,మాటలతో అభిమానులను టీవీలకు కట్టిపడేస్తుంది. ఏమాత్రం బాలీవుడ్ తారల మించకుండా తన సోగసరి అందర్నీ ఆకట్టుకునేది. జీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ అయిన ఫుట్‌బాల్ కేఫ్‌తో మెుదలుపెట్టిన తన ప్రయాణాన్ని క్యాష్ లీగ్ ఐపీఎల్‌తో మరింతగా మెరిసింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. స్పోర్ట్స్ యాంకర్‌గా ఖ్యాతిగంచిన మయాంతి చివరకు స్పోర్ట్‌మ్యాన్‌నే తన భాగస్వామిగా చేసుకున్నారు. క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని ఆమె వివాహమడారు.యాంకర్ జాబితా

స్టార్ విడుదల చేసిన యాంకర్ జాబితాలో ముందు సీజన్లలో యాంకర్‌గా వ్యవహరించిన జతిన్ సప్రూ, అనంత్ త్యాగి, సంజనా గణేశన్, సుహాలి చందోక్‌లను ఈ సారి కూడా వారినే కొనసాగించింది. ముఖ్యంగా ఈ లీస్ట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్ స్పోర్ట్స్ జర్నలిస్టు నెరోలీ మెడోస్‌ చోటు దక్కించుకున్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 18, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading