Home /News /ipl /

LOUD BETTING IN IPL CRICKET AT VILLAGES IN TELANGANA VB

Cricket betting: జోరుగా క్రికెట్ బెట్టింగ్.. బెట్టింగ్ రాయుళ్లు వాడే భాష ఎలా ఉంటుందో తెలుసా.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం (source - You tube)

ప్రతీకాత్మక చిత్రం (source - You tube)

ఐపీఎల్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదేమాట. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్న ఆట క్రికెట్. దేశంలో నిన్నటి నుంచి క్రకెట్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు సందట్లో సడేమియా అనే చందంగా ఒకవైపు క్రికె ట్‌ను ఆస్వాదిస్తునే మరోవైపు తమదైన శైలిలో బెట్టిం గ్ కాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదేమాట . చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్న ఆట క్రికెట్. దేశంలో నిన్నటి నుంచి క్రకెట్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు సందట్లో సడేమియా అనే చందంగా ఒకవైపు క్రికె ట్‌ను ఆస్వాదిస్త్ నే మరోవైపు తమదైన శైలిలో బెట్టిం గ్ కాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కా కుండా సాగుతున్న ఈ బెట్టింగ్‌లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. గత పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. మొదట్లో కేవలం ఇండియా టీమ్ ఆడే మ్యాచ్ లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా టి-20 మ్యాచ్ లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం ఊపందుకుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఐపిఎల్ యువతను మరింత కట్టి పడేసింది.

  ఒకే సీజన్ లో వరసగా సుమారు 90 కి పైగా మ్యాచ్ లు జరుగుతుండటంతో.. బెట్టింగ్ ల జోరుకు అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. ఏప్రిల్ 9వ తేదీ ఐపిఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ రాయుళ్ల హవా మొదలైంది. బెట్టింగ్ లకు బానిసలుగా మారిన చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా రాష్ర్టం లో క్రికెట్‌ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. పలు జిల్లా కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ దందా ఊపందుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఇంతకు ముందు నగరాలకే పరిమితం కాగా ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది. బెట్టింగులో ఎక్కువ శాతం యువత పాల్గొంటున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో క్రికెట్‌లో గెలుపోటములపై వారు పందాలు కాస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో యువతకు అధునాతన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉండడంతో గుట్టచప్పుడు కాకుండా యువత ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ బుకీలను పరిచయం చేసుకుంటున్న యువత వారి ప్రోత్సాహంతో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

  పట్టణ ప్రాంతాలో బుకీలు
  క్రికెట్ బెట్టింగ్‌ను నడిపించే ముంబయ్, డిల్లీ, హైదరాబాద్ సంబంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహస్యంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్‌ భాష వినియోగిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు. బుకీల దగ్గర రిజిస్టర్‌ అయిన నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే స్పందిస్తున్న యువత బెట్టింగుకు మొగ్గు చూపుతున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్‌ ’అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలనేది దాని అంతరార్థం. అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్‌ ’ అని, తక్కువ అవకాశాలున్న జట్టుపై పందెం కాసేందుకు ‘ఈటింగ్‌ ’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. మ్యాచ్‌ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతూ యువత బెట్టింగులో పాల్గొంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారిచేస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం బెట్టింగ్ లనే వృత్తిగా సాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడేవారి పై కఠిన చర్యలు తీసుకోవాల ని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Betting, Cricket betting, Cricket betting language, IPL 2021, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు