KXIP VS RR IPL 2020 LIVE SCORE KINGS XI PUNJAB VS RAJASTHAN ROYALS SMITH WON TOSS OPT TO BOWL SK
KXIP vs RR, IPL 2020 Live score: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్..
కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్ (Image:IPL)
KXIP vs RR, IPL 2020 Live score: రాజస్థాన్ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో వరుణ్ అరోన్ టీమ్‌లోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో అబుదాబి వేదికగా 50వ మ్యాచ్ జరుగుతోంది. షేక్ జాయెద్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తలపడుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో వరుణ్ అరోన్ టీమ్‌లోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన సభ్యులే ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు.
జట్ల వివరాలు:
Kings XI Punjab (Playing XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మందీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.
ఐపీఎల్లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 20 సార్లు తలపడ్డాయి. 11 సార్లు రాజస్థాన్ గెలవగా.. 9 సార్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 27న షార్జాలో జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. పంజాబ్ విధించిన 223 పరుగుల టార్గెట్‌ను కూడా చేధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి రాజస్థాన్ రాయల్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. పంజాబ్‌పై మళ్లీ గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు..5 మాత్రమే గెలిచింది. మరో ఏడింట ఓటమి పాలయింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. మరోవైపు టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఆరు గెలిచి, మరో ఆరు ఓడిపోయింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కేఎల్ రాహుల్ సేనకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.