Home /News /ipl /

KXIP VS RR IPL 2020 LIVE SCORE KINGS XI PUNJAB VS RAJASTHAN ROYALS PUNJAB SCORES 184 SK

KXIP vs RR, IPL 2020 Live score: గేల్ సిక్స్‌ల మోత..సెంచరీ మిస్.. పంజాబ్ భారీ స్కోర్

క్రిస్ గేల్ (Image:IPL)

క్రిస్ గేల్ (Image:IPL)

KXIP vs RR, IPL 2020: యూనివర్స్ స్టార్ క్రిస్ గేల్ సిక్స్‌ల మోత మోగించాడు. 63 బంతుల్లో 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి.

    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 50వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. యూనివర్స్ స్టార్ క్రిస్ గేల్ సిక్స్‌ల మోత మోగించాడు. 63 బంతుల్లో 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఒకే ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు క్రిస్ గేల్. కేఎల్ రాహుల్ 46, నికోలస్ పూరన్ 22 రన్స్ చేశాడు. మందీప్ సింగ్ డకౌట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 6, దీపక్ హుడా 1 రన్స్ చేశారు.

    వాస్తవానికి పంజాబ్ జట్టు ఆరంభంలోనే ఇబ్బంది పడింది. ఒక పరుగుకే ఓపెనర్ మందీప్ సింగ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌లో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 121 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ వస్తూ వస్తూనే సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఇక 162 పరుగుల వద్ద పూరన్ ఔట్ కావడంతో మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన గేల్ 99 పరుగులు చేశాడు. మరో షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ అవ్వడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్ తలో రెండు వికెట్లు తీశారు.

    ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 20 సార్లు తలపడ్డాయి. 11 సార్లు రాజస్థాన్ గెలవగా.. 9 సార్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 27న షార్జాలో జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. పంజాబ్ విధించిన 223 పరుగుల టార్గెట్‌ను కూడా చేధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి రాజస్థాన్ రాయల్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. పంజాబ్‌పై మళ్లీ గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది.


    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు..5 మాత్రమే గెలిచింది. మరో ఏడింట ఓటమి పాలయింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. మరోవైపు టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఆరు గెలిచి, మరో ఆరు ఓడిపోయింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కేఎల్ రాహుల్ సేనకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chris gayle, IPL, IPL 2020, Kings XI Punjab, Rajasthan Royals

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు