IPL 2020 LIVE Score, KXIP vs RCB: పంజాబ్ సూపర్ విక్టరీ.. ఆర్సీబీ ఘోర పరాజయం

ఐపీఎల్‌-13లో భాగంగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. 97 పరుగులతో ఆర్సీబీపై పంజాబ్‌ గెలుపోందింది. 


Updated: September 25, 2020, 12:25 AM IST
IPL 2020 LIVE Score, KXIP vs RCB: పంజాబ్ సూపర్ విక్టరీ.. ఆర్సీబీ ఘోర పరాజయం
ఐపీఎల్‌-13లో భాగంగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. 97 పరుగులతో ఆర్సీబీపై పంజాబ్‌ గెలుపోందింది. 
  • Share this:
ఐపీఎల్‌-13లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌,  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు‌  మధ్య      జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఆర్సీబీపై పంజాబ్ ‌ జట్టు విజయం సాధించింది. కింగ్స్ బౌలర్లకు బెంగుళూర్ బాట్స్‌మెన్స్ పూర్తిగా దాసోహం అయ్యారు. 17 ఓవర్లలో 109 పరుగులకే అలౌటై ఘోర పరజాయాన్ని చవిచూసింది బెంగుళూర్ జట్టు . ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్‌(20), డివిలియర్స్‌(28), వాషింగ్టన్‌ సుందర్‌(30), శివం దూబే(12)లు రెండంకెల స్కోరు చేయగా మిగితా బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు.

ఆరంభంలోనే ఆర్సీబీ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో మెరిసిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌(1) ఈ సారి నిరాశపరిచాడు. వన్ డౌన్‌లో వచ్చిన జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. జట్టుకు అండగా నిలుస్తాడు అనుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(1) కాట్రెల్‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రవి బిష్నోయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఫించ్(21),డివిలయర్స్(28) వికెట్లను కూడా ఆర్సీబీ కొల్పోయింది.

SCHEDULE TIME TABLE:

పంజాబ్ నిర్ధేశించిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ  మెుదటి  మూడు ఓవర్లలో       మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డివిలియెర్స్‌-ఫించ్‌లు కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచిన..ఆ తర్వాత వారి కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఆర్సీబీ వికెట్లు టపాటపామని పడిపోయాయి. చివరకు బెంగుళూర్ 109 పరుగులకే చాప చూట్టేసింది.

ORANGE CAP:

అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు పంజాబ్‌‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరిసిన ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ ఈ సారి 20 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్.. ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ నిర్ణత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 11:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading