IPL 2020 KXIP vs RCB: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌ చరిత్ర.. పంజాబ్ భారీ స్కోర్

దుబాయ్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ మరో బిగ్ ఫైట్ జరుగుతుంది. టాస్ గెలిచిన కోహ్లీ పంజాబ్‌‌ను బ్యాటింగ్‌ అహ్వనించాడు.


Updated: September 24, 2020, 10:26 PM IST
IPL 2020  KXIP vs RCB: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌ చరిత్ర.. పంజాబ్ భారీ స్కోర్
KL-Rahul-2-KXIP
  • Share this:
ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ మరో బిగ్ ఫైట్ జరుగుతుంది. పంజాబ్ బాట్స్‌మెన్స్ దాటిగా ఆడడంతో ఆ జట్టు 206 పరుగులు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డాషింగ్ బ్యాటింగ్ ఆడిన ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ ఈ సారి 20 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ ముందు ఆచితూచి ఆడినప్పటికి. తర్వాత బ్యాట్‌కు పనిచేప్పారు.36 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది 17వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. తర్వాత బెంగుళూర్ బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్స్‌లతో 132 పరుగులు చేశాడు.

SCHEDULE TIME TABLE:

ఈ మ్యాచ్‌లో రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని దాటిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ మెుత్తం వన్ మ్యాన్ షోగానే సాగింది. స్లాగ్‌ ఓవర్లలో రాహుల్‌ దాటిగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీ ఆటగాళ్ళు చేసిన  పోరపాట్లును రాహుల్‌కు సద్వినియోగం చేసుకుని శతకంతో సాధించాడు. నికోలస్‌ పూరన్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు.  వీరిద్దరూ కలిసి 57 పరుగుల భాగ‍్వామ్యాన్ని జత చేశారు.  ఆర్సీబీ బౌలర్లలో దూబే రెండు వికెట్లు తీయగా, చహల్‌కు వికెట్‌ దక్కింది.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading