IPL 2020: "కోహ్లి, డివిలయర్స్ ను ఐపీఎల్‌ నుంచి నిషేధించాలి"

రాహుల్ ఫన్నిగా సమాధానం ఇస్తూ.. "వచ్చే సీజన్ నుంచి కోహ్లీ, ఎబినీ ఐపిఎల్ నుంచి నిషేధించాలి" అంటూ సరాదగా సమాధానం ఇచ్చాడు.


Updated: October 15, 2020, 8:02 PM IST
IPL 2020:
సీఎస్కే‌పై కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ విజయం
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బాట్స్‌మెన్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ ఉన్నారు. వీరిద్దరూ అన్ని ఎడిషన్లలో ధారాళంగా పరుగులు సాధిస్తూ టాప్ స్కోరర్‌గా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2020లో కూడా మంచి ఫామ్‌తో జట్టును విజయాతీరాలకు చేరుస్తున్నారు.

ఐపిఎల్ 2020లో భాగంగా గురువారం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆర్సీబీ  తలపడనుంది. ఈ సంధర్భంగా జట్ల కెప్టెన్లు పూమా ఇండియా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నారు. టి 20 క్రికెట్‌లో తాను చూడాలనుకుంటున్న ఒక మార్పు గురించి కోహ్లీ.. రాహుల్‌ను అడగ్గా. దానికి రాహుల్ ఫన్నిగా సమాధానం ఇస్తూ.. "వచ్చే సీజన్ నుంచి కోహ్లీ, ఎబినీ ఐపిఎల్ నుంచి నిషేధించాలి" అంటూ సరాదగా సమాధానం ఇచ్చాడు.





రానున్న ఐపీఎల్‌లో మీ ఇద్దరు ఆడకుండా బ్యాన్ చేయాలని నిర్వహులను కొరుతాను. ఆట తీరు ఓ స్థాయిని మించిన తర్వాత ప్రేక్షకులే ఇక చాలు అంటారు. 5 వేల మార్కును చేరుకునే వరకు ఆడితే చాలు, ఆ తర్వాత మరొ బాట్స్‌మెన్ అవకాశం కల్పించాలి"అంటూ కోహ్లితో ఫన్నీగా సంభాషించాడు. అలాగే ఇతర అంశాలపై కూడా వీరు చర్చించారు. "100 మీటర్లకు పైగా సిక్స్‌ వెళ్ళితే వాటికి అదనపు పరుగు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు" కేఎల్ రాహుల్. అయితే దాని కంటే ముందు ఈ విషయంపై బౌలర్లతో మాట్లాడాలి.. నేను అవును అంటే.. బౌలర్లు నన్ను చూసినప్పుడు వారి ముఖంలో మార్పు చూడాల్సివస్తుదంటూ" కోహ్లి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

"ఒక్క పరుగు గెలుపోటములపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. నోబాల్,ఫుల్‌టాస్,లో ఫుల్‌టాస్, వైడ్‌ రివ్యూపై విస్తృతంగా సమీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని  జట్టు సారథిగా నేను అభిప్రాయపడుతున్నాను" అంటూ పేర్కొన్నారు.
Published by: Rekulapally Saichand
First published: October 15, 2020, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading