ఐపీఎల్ 2020

  • associate partner

KL Rahul: కేఎల్ రాహుల్ ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?

KL Rahul-Athiya Shetty: ఐపీఎల్ 2020లో కింగ్స్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు కేఎల్ రాహుల్. వ్యక్తిగతంగా బాగా ఆడుతున్నప్పటికీ జట్టును మాత్రం గెలిపించ లేకపోతున్నాడు. పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది.

news18-telugu
Updated: October 16, 2020, 10:32 PM IST
KL Rahul: కేఎల్ రాహుల్ ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?
అథియా శెట్టితో కేఎల్ రాహుల్
  • Share this:
క్రికెట్, టీమిండియా.. వీటి బంధం ఈనాటిది కాదు. క్రికెటర్లు, సినిమా హీరోయిన్ల మధ్య ఫ్రెండ్‌షిప్ ఎప్పటి నుంచో ఉంది. కొన్ని జంటలైతే పెళ్లి కూడా చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంటే ఇందుకు ఉదాహరణ. ఐతే టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి మధ్య ఏదో ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, కలిసి ఫొటోలు దిగడంతో.. ఈ స్టార్స్ మధ్య ప్రేమాయణం సాగుతోందని ఇటు బాలీవుడ్, అటు క్రికెట్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఐతే తాజాగా వీరి గురించి జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్‌లో కేఎల్ రాహుల్ వైఫ్ (kl rahul wife) అని టైప్ చేస్తే అథియా శెట్టి అని చూపిస్తోంది. పేరు మాత్రమే కాదు.. వారిద్దరు కలిసున్న ఫొటోలను కూడా ప్రదర్శిస్తోంది. అది చూసిన నెటిజన్లు.. వామ్మో ఇదెప్పుడు జరిగింది? కేఎల్ రాహుల్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా? అని గూగుల్‌పై సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి వారిద్దరికి పెళ్లి కాలేదు. గూగుల్ శోధనలో పొరపాటున అలా చూపిస్తోంది. కేఎల్ రాహుల్, అథియా శెట్టి గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తుండడంతో .. అథియాను కేఎల్ రాహుల్ వైఫ్‌గా చూపిస్తోంది గూగుల్ అల్‌గారిథమ్.


ఇప్పటికే కొహ్లీ భార్య అనుష్క శర్మను రషీద్ ఖాన్ భార్యగా చూపించింది. గూగుల్‌లో 'రషీద్‌ ఖాన్‌ భార్య' అని సెర్చ్‌ చేస్తే అనుష్క శర్మ అని వచ్చింది. వాస్తవానికి రషీద్‌ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. అనుష్క భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. కానీ గూగుల్ మాత్రం తప్పులో కాలేసింది.


అంతేకాదు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్ భార్య ఎవరంటే సారా అని సచిన్ టెండూల్కర్ కూతురి పేరు చెప్పింది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్‌లో shubman gill wife లేదా shubman gill girl friend అని సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ పప్పులో కాలేసి.. సారాను శుభమాన్ గిల్ భార్యగా చూపిస్తోంది. వాస్తవానికి వీరిద్దరికి పెళ్లి కాలేదు.


ఇప్పుడేమో.. కేఎల్ రాహుల్‌తో అథియా శెట్టికి పెళ్లి చేసింది గూగుల్. దాంతో గూగుల్ అల్‌గారిథమ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ''గూగుల్ తల్లీ.. నీకేమయిందమ్మా..'' ''ఎందుకిలా కన్‌ఫ్యూజ్ అవుతున్నావ్.. మమ్మల్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావ్..'' అని జోకులు పేల్చుతున్నారు.

ఐపీఎల్ 2020లో కింగ్స్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు కేఎల్ రాహుల్. వ్యక్తిగతంగా బాగా ఆడుతున్నప్పటికీ జట్టును మాత్రం గెలిపించ లేకపోతున్నాడు. పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ సేన.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండూ బెంగళూరుపైనే గెలవడం విశేషం. ఇక కేఎల్ రాహల్ ఇప్పటి వరకు 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. 448 పరుగులతో టాప్‌లో ఉండి.. ఆరెంజ్ క్యాప్‌ను ధరిస్తున్నాడు.
Published by: Shiva Kumar Addula
First published: October 16, 2020, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading