KKR vs RR, IPL 2020: డూ ఆర్ డై మ్యాచ్‌లో కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. దుబాయ్‌లో పరుగుల వరద పారించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయార్ మోర్గాన్ సిక్స్‌ల మోత మోగించాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. శుభమాన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి (39), ఆండ్రే రస్సెల్ (25) పరవా లేదనిపించారు. నితీష్ రాణా (0), సునీల్ నరైన్ (0), దినేష్ కార్తీక్ (0) ప్యాట్ కమ్మిన్స్ (15) రాణించలేదు. కోల్‌కతా జట్టు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. మొదటి ఓవర్లోనే నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుభమాన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఐతే తొమ్మిదో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తెవాటియా బౌలింగ్‌లో శుభమాన్ గిల్, నరైన్ ఔటయ్యారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే త్రిపాఠి, కార్తీక్ ఫెవిలియన్ చేరారు. ఐతే రస్సెల్, మోర్గాన్ 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మళ్లీ రెండు వికెట్లు పడినా.. ఇయాన్ మోర్గాన్ మాత్రం ధాటిగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి 2, శ్రేయాస్ గోపాల్ 1, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 21 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 11 సార్లు కేకేఆర్ గెలిచింది. 10 సార్లు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి ఇరుజట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 30న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోసారి రాజస్థాన్‌ను ఓడించి.. ప్లేఆఫ్స్ బరిలో ఉండాలని కోల్‌కతా కూడా పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2020 సీజన్లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడాయి. రెండూ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో ఏడింటిలో ఓటమి పాలయ్యాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా.. పాయింట్ల పట్టికలో కోల్‌కతా కంటే రాజస్థాన్ మెరుగైన స్థానంలో ఉంది. కోల్‌కతా అట్టడుగున ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో నిలిచింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.