KKR vs Mi: కోల్‌కతా,ముంబై తుది జట్లు ఇవే!.. కీ ఫ్లేయర్‌ను తప్పించిన ముంబై


Updated: September 23, 2020, 3:48 PM IST
KKR vs Mi: కోల్‌కతా,ముంబై తుది జట్లు ఇవే!.. కీ ఫ్లేయర్‌ను తప్పించిన ముంబై
  • Share this:


ఐపీఎల్‌లో మరో బిగ్ ఫైట్‌కు తెరలేచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్,కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య అబుదాబి వేదికగా మరికొద్ది గంటల్లో సమరం మెుదలుకానుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి చెందిన ముంబై ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సత్తా చాటలని చూస్తోంది. ఇక ipl 2020లో మెుదటి మ్యాచ్ ఆడుతున్న కోల్‌కతా టోర్నీలో తన ప్రయాణాన్ని విజయంతో ఆరంభించాలని చూస్తుంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక రెండు జట్ల బలాబలాను ఒక్కసారి చూస్తే.. బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్‌లోనూ ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 25 సార్లు ఈ టీమ్స్ తలపడగా 19 సార్లు ముంబై గెలవగా,కోల్‌కతా 6 సార్లు గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి చూపు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆండ్రూ రస్సెల్‌పైనే.. ఈ సారి అతను టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.

SCHEDULE TIME TABLE:

దీంతో రస్సెల్‌ బ్యాటింగ్ విన్యాసాన్ని ఎక్కువ సమయం  చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. అలాగే యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌,కెప్టెన్ దినేశ్ కార్తీక్‌, ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్ నైట్‌రైడర్స్ బ్యాటింగ్ లైనప్ స్టాంగ్‌గా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో రూ.15.5 కోట్లు పెట్టి తీసుకున్న ప్యాట్ కమిన్స్ తుది జట్టులో ఆడనున్నారు. అతనితో పాటు కుల్దీప్ యాదవ్, కమలేశ్ నాగర్‌కోటి, శివం మావి, ప్రసిద్ క్రిష్ణలతో కోల్‌కత్తా బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.



ఇక ముంబై విషయానికి వస్తే చెన్నైతో ఆడిన జట్టుచే కొనసాగించ వచ్చు. కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోకి ఇషాన్ కిషాన్‌ను తీసుకోవచ్చు. బౌలింగ్‌లో జేమ్స్ పాటిన్సన్‌ స్ధానంలో కౌల్టర్ నీల్‌ తుది జట్టులో ఉండవచ్చు.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading