ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, KKR vs MI: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓటమి.. విఫలమైన బాట్స్‌మెన్స్

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్,కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమి పాలైంది. ముంబై జట్టు నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోల్‌కత్తా బ్యాట్స్‌మన్స్ తడబడ్డారు.


Updated: September 24, 2020, 12:10 AM IST
IPL 2020 Live Score, KKR vs MI: కోల్‌కత్తా  నైట్‌రైడర్స్ ఓటమి.. విఫలమైన బాట్స్‌మెన్స్
MUMBAI INDIANS
  • Share this:
అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్,కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై జట్టు నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోల్‌కత్తా బ్యాట్స్‌మన్స్ తడబడ్డారు. ఏ మాత్రం లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆ జట్టు సాగలేదు. ఓపెనర్లు శుభమాన్ గిల్ (7),సునీల్ నరైన్ (9) స్వల్ఫ పరుగులకే ఔటైయ్యారు. ఇక కెప్టెన్ దినేష్ కార్తీక్,నితీష్ రానా కొద్ది సేపు దాటిగా ఆడినప్పటికి చివరకు వారు కూడా ఔటవ్వడంతో టాప్‌ ఆర్డర్‌ విఫలమై కోల్‌కత్తా ఓటమి దిశగా పయనించింది. అదుకుంటాడు అనుకున్న ఆండ్రీ రసెల్(11) కూడా విఫలం కావడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ఓటమి తప్పలేదు. చివరకు 146 పరుగులకే చాప చుట్టేసింది. కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా ,ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌ రెండు వికెట్లు సాధించగా.కీరోన్‌ పొలార్డ్‌కు ఒక్క వికెట్‌ దక్కింది.



టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుని ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌‌కు అహ్వనించాడు. ఓపెనర్లు జట్టుకు శుభరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో క్వింటన్‌ డికాక్‌ వికెట్‌ను ముంబై కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే స్టార్ బాట్స్‌మెన్ డికాక్‌ ను  పెవిలియన్ కు‌ పంపాడు యువ పేసర్‌ శివమ్‌ మావి. తర్వాత సూర్య కూమర్,రోహిత్ శర్మ దాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్‌ శర్మ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు.

SCHEDULE TIME TABLE:



అతనికి తోడు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా బౌండరీలతో హిట్టింగ్ ఆడారు. పవర్‌ప్లే ఓవర్లలో జట్టు స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో 98 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికి రోహిత్ తన జోరును కొనసాగించాడు. 39 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న ముంబై కెప్టెన్, చివరకు 54 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి శివం మావి బౌలింగ్‌లో ఔటైయ్యాడు. ఇక మెరుస్తాడు అనుకున్న స్టార్ అల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా 18 పరుగులు చేసి హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరకు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు స్కోర్ చేసింది. కోల్‌కత్తా బౌలర్ శివం మావి రెండు వికెట్లు తీసుకున్నాడు
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 11:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading