KKR vs DC, IPL 2020: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. జట్లలో మార్పులు ఇవే

శ్రేయాస్ అయ్యర్, ఇయాన్ మోర్గాన్ (Image:IPL)

IPL 2020, Kolkata Knight Riders vs Delhi Capitals Live Score: ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. పృథ్వీ షా స్ధానంలో అజింక్య రహానే, సామ్ స్థానంలో నార్జీ జట్టులోకి వచ్చారు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో మరికాసేపట్లో 42వ మ్యాచ్ జరుగుతుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. పృథ్వీ షా స్ధానంలో అజింక్య రహానే, సామ్ స్థానంలో నార్జీ జట్టులోకి వచ్చారు. అటు కోల‌్‌కతా కూడా రెండు మార్పులు చేసింది. కుల్దీప్, బాంటన్ స్థానంలో కమలేశ్ నాగర్ కోటి, సునీల్ నరైన్‌ను జట్టులోకి తీసుకున్నారు.



    జట్ల వివరాలు:

    Kolkata Knight Riders (Playing XI): శుభమాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

    Delhi Capitals (Playing XI): శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కుస్ స్టోయినిస్, షిమ్రోన్ హెట్‌మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నార్జీ



    ఐపీఎల్‌లో కోల్‌కతా, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 24 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. కేకేఆర్ 13 సార్లు గెలవగా... డీసీ 11 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకుముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 3న షార్జాలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ గెలిచింది. 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కోల్‌కతా. మరోసారి ఓడించి సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పట్టుదలతో ఉంది.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిట్స్ టీమ్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింటిలో  ఓడిపోయింది. 14 పాయింట్లతో రెండో స్ధానంలో ఉంది. ఇక కోల్‌‌కతా విషయానికొస్తే.. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన  ఆ జట్టు.. 5 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది మోర్గాన్ సేన.
    Published by:Shiva Kumar Addula
    First published: