KKR vs DC, IPL 2020: నితీష్ క్లాస్.. నరైన్ మాస్.. కోల్‌కతా భారీ స్కోర్.. ఢిల్లీ గెలిచేనా?

సునీల్ నరైన్ (Image:IPL)

IPL 2020, Kolkata Knight Riders vs Delhi Capitals Live Score: కోల్‌కతా 42 రన్స్‌కే 3 వికెట్లు కోల్పయిన వేళ.. నితీష్ రాణా, నరైన విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. నరైన్ ఊరమాస్ బ్యాటింగ్ చేస్తే.. నితీష్ క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో  42వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడుతున్నాయి.  టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో..194 పరుగులు చేసింది.  నితీష్ రాణా, సునీల్ నరైన్ అర్ధసెంచరీలతో మెరుపులు మెరిపించారు. నితీష్  53 బంతుల్లో 81  (1 సిక్స్, 13 ఫోర్లు) పరుగులు, నరైన్ 32 బంతుల్లో 64 (4 సిక్స్‌లు, 6 ఫోర్లు) పరుగులు చేశాడు.  శుభమాన్ గిల్ 9,  రాహల్ త్రిపాఠి 13, దినేష్ కార్తీక్ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు.  చివర్లో కెప్టెన్ మోర్గాన్ కూడా చెలరేగియాడు.  9 బంతుల్లో  17 రన్స్ చేశాడు. కోల్‌కతా 42 రన్స్‌కే 3 వికెట్లు కోల్పయిన వేళ.. నితీష్ రాణా, నరైన విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. నరైన్ ఊరమాస్ బ్యాటింగ్ చేస్తే.. నితీష్ క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. వీరితో పాటు కెప్టెన్ మోర్గాన్ చెలరేగడంతో కోల్‌కతా 194 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్జీ,  కసిగో రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

    ఐపీఎల్‌లో కోల్‌కతా, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 24 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. కేకేఆర్ 13 సార్లు గెలవగా... డీసీ 11 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకుముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 3న షార్జాలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ గెలిచింది. 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కోల్‌కతా. మరోసారి ఓడించి సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పట్టుదలతో ఉంది.

    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిట్స్ టీమ్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింటిలో  ఓడిపోయింది. 14 పాయింట్లతో రెండో స్ధానంలో ఉంది. ఇక కోల్‌‌కతా విషయానికొస్తే.. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన  ఆ జట్టు.. 5 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది మోర్గాన్ సేన.
    Published by:Shiva Kumar Addula
    First published: