ఐపీఎల్ 2020

  • associate partner

కోల్‌కత నైట్ రైడర్స్‌ ఇక ఇంటికే.. ఫ్లేఆప్ చేరాలంటే అదొక్కటే మార్గం

తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.


Updated: October 30, 2020, 11:43 AM IST
కోల్‌కత నైట్ రైడర్స్‌ ఇక ఇంటికే.. ఫ్లేఆప్ చేరాలంటే అదొక్కటే మార్గం
తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
  • Share this:
తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే మ్యాచ్ గెలిచి ఉంటే కేకేఆర్ పరిస్థితి మరోలా ఉండేది. ఇక కోల్‌కతా గెలవాలంటే తర్వాతి మ్యాచ్‌ను గెలవడంతో పాటు, ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్‌రేట్‌ అంశాలపై అధారపడిన పరిస్థితి ఏర్పాడింది.

చెన్నై పోతూ.. పోతూ మరికొన్ని జట్లను తనతో పాటు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దుబాయ్ వేదికగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచి ఫ్లేఆఫ్ చేరాలన్న కేకేఆర్ ఆశలపై నీళ్ళు చల్లింది చెన్నై. చివరిలో జడేజా సూపర్ హిట్టింగ్ ఆడాడు. 11 బంతుల్లో 31 పరుగులు చేసి చెన్నైని గెలిపించాడు. అంతకుముందు మెుదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ నితీష్‌ రాణా 61 బంతుల్లో 87 పరుగులతో చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. దీంతో కోల్‌కత ప్లేఆఫ్ అవకాశాలకు గండి పడింది.

ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడిన కోల్‌కతా 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టుకు మిగిలింది ఒక్క మ్యాచే. అందులో గెలుస్తుందనే గ్యారంటీ లేదు.. గెలిచినా నేరుగా ప్లేఆప్ అవకాశాలకు చేరుకోలేదు. ప్రస్తుతం ఆ జట్టు రన్‌రేటు మైనస్‌లో ఉంది. తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. అందులో కోల్‌కతా ఓడితే ఇక ఇంటికే... ఐపీఎల్-2020 సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూనే సాగింది. 13 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. ఏడింట్లో ఓడిపోయి.. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచింది. ముఖ్యంగా ఆ జట్టు నాయకత్వ మార్పు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపునంటూ కనిపించింది. సీజన్ సగానికి పైగా కెప్టెన్‌గా వ్యవహరించిన దినేష్ కార్తీక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం.. నాయకత్వాన్ని ఇవాన్ మోర్గాన్‌కు అప్పగించడం జరిగిపోయాయి. ఇక కోల్‌కతా ఫ్లేఆప్‌తో నిలవాలంటే రాజస్ధాన్‌పై భారీ విజయాన్ని  సాధించడం ఒక్కటే మార్గం
Published by: Rekulapally Saichand
First published: October 30, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading