KARTHIKA DEEPAM VS IPL PREMI VISHWANATH GIFTS TV TO SURYAPET FAN SK
Karthika Deepam VS IPL: ఐపీఎల్ వేళ కొత్త కష్టం.. కార్తీప దీపం అభిమానికి దీపక్క గిఫ్ట్
ప్రేమి విశ్వనాథ్ ( Instagram)
శివచరణ్ బాధ ఆ నోటా ఈ నోటా పడి.. చివరకు కార్తీక దీపంలో దీప పాత్రను పోషిస్తున్న హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్‌కు చేరింది. ఒక సీరియల్‌ను ఇంతలా అభిమానించే వారు ఉంటారా అని ఆమె ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఎంతో సంతోష పడింది.
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌కు కోట్లాది అభిమానులన్నారు. రాత్రి ఏడున్నర అయిదంటే చాలా అన్ని ఇళ్లల్లో దీపక్క పలుకులు వినిపించాల్సిదే. ఈ సమయంలో ఇతర ఛానెళ్లలో పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా.. కార్తీక దీపం రేటింగ్‌ను మాత్రం క్రాస్ చేయలేవు. అంతలా అందరికీ దగ్గరయ్యి..బుల్లితెరపై రికార్డుల మోత మోగిస్తోంది. ఐతే కార్తీక దీపం అభిమానులకు ఇప్పుడు ఐపీఎల్ రూపంలో కొత్త కష్టం వచ్చిపడింది. కార్తీక దీపం సీరియల్ ప్రసారమయ్యే సమాయానికి ఐపీఎల్ కూడా వస్తుండంతో ఇంట్లో అప్పుడే రచ్చ మొదలయింది. క్రికెట్ అని భర్త.. లేదు కార్తీక దీపం అని భార్య.. అందరి ఇళ్లల్లోనూ ఇదే లొల్లి..!
ఈ సమస్యను ఇప్పటికే సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ వేళలను మార్చాలంటూ ఏకంగా సౌరవ్ గంగూలీకే విజ్ఞప్తి చేశాడు. 'సార్.. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్‌ను 8 గంటలకు మార్చండి. రాత్రి 07.30కి కార్తీక దీపం సీరియల్ వస్తుంది. ఇంట్లో అందరూ అదే చూస్తారు. మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. అందుకే ఐపీఎల్ టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి.' ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను స్టార్ మాతో పాటు గంగూలీకి ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది.
@SGanguly99 sir please change the timing of @IPL from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house@ChennaiIPL@StarMaa
శివచరణ్ బాధ ఆ నోటా ఈ నోటా పడి.. చివరకు కార్తీక దీపంలో దీప పాత్రను పోషిస్తున్న హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్‌కు చేరింది. ఒక సీరియల్‌ను ఇంతలా అభిమానించే వారు ఉంటారా అని ఆమె ఆశ్చర్యపోయింది. అదే సమయంలో తన సీరియల్‌కు వస్తున్న ఆదరణను చూసి ఎంతో సంతోష పడింది. ఐపీఎల్ టైమింగ్ మార్చడం కుదరని భావించిన ప్రేమి విశ్వనాథ్.. వారి అభిమానాన్ని మెచ్చి ఏకంగా టీవీని గిఫ్ట్‌గా ఇచ్చింది. 32 ఇంచుల ఎల్ఈడీ టీవీతో పాటు ఓ ఉత్తరాన్ని అతడి ఇంటికి పంపించింది. ఇప్పుడు ఒక టీవీలో శివచరణ్ ఎంచక్కా ఐపీఎల్ చూడవచ్చు.. మరో టీవీలో మిగతా కుటుంబ సభ్యులు కార్తీక దీపం సీరియల్ చూడవచ్చు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న నెటిజన్లు.. దీపక్క ఎంత మంచిదో అని మెచ్చుకుంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.