ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్‌లో కొత్త రికార్డ్.. చరిత్ర సృష్టించిన ఢిల్లీ పేసర్ రబాడ

IPL 2020: అతి తక్కువ బంతుల్లో 50 ఐపీఎల్‌ వికెట్లను సాధించిన ఘనతను సైతం రబాడ సొంతం చేసుకున్నాడు. 616 బంతుల్లో అతడు 50 వికెట్లు పడగొట్టాడు.

news18-telugu
Updated: October 17, 2020, 10:42 PM IST
IPL 2020: ఐపీఎల్‌లో కొత్త రికార్డ్.. చరిత్ర సృష్టించిన ఢిల్లీ పేసర్ రబాడ
కగిసో రబాడ (Image:IPL)
  • Share this:
IPL 2020: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు ఈ సౌతాఫ్రికన్ ప్లేయర్. షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబాడ ఈ రికార్డు అందుకున్నాడు. సీఎస్‌కే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ వికెట్ తీసిన తర్వాత ఐపీఎల్‌లో 50 వికెట్స్ ఫీట్ సాధించాడు రబాడ. ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ పేరిట ఉండేది. నరైన్ 32 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీయగా.. రబాడ మాత్రం 27వ మ్యాచ్‌లోనే ఈ మార్క్‌ను చేరాడు.

అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా:

1. కగిసో రబాడ 27 మ్యాచ్‌లు

2. సునీల్ నరైన్ 32 మ్యాచ్‌లు

3. లసిత్ మలింగా 33 మ్యాచ్‌లు

4. ఇమ్రాన్ తాహీర్ 35 మ్యాచ్‌లు

5. అమిత్ మిశ్రా 37 మ్యాచ్‌లుఅంతేకాదు అతి తక్కువ బంతుల్లో 50 ఐపీఎల్‌ వికెట్లను సాధించిన ఘనతను సైతం రబాడ సొంతం చేసుకున్నాడు. 616 బంతుల్లో అతడు 50 వికెట్లు పడగొట్టాడు. రబాడ తర్వాతి స్థానంలో శ్రీలంక బౌలర్ మలింగ ఉన్నాడు. అడు 749 బంతుల్లో 50 వికెట్లు సాధించాడు. ఇక వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 760 బంతుల్లో 50 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. కాగా, షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబాడ 4 ఓవర్లో బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ తీశాడు.

2017లో ఐపీఎల్‌లోకి అరంగ్రేటం చేశాడు కగిసో రబాడ. ఆ సీజన్లో కేవలం 6 వికెట్లు మాత్రమే సాధిచాడు. 2018 సీజన్‌కు అతడు దూరంగా ఉన్నాడు. ఇక గత ఏడాది అద్భుతంగా రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 25 వికెట్లు తీసి.. పర్పల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. పర్పుల్ క్యాప్ విన్నర్ ఇమ్రాన్ తాహిర్ కంటే ఒక వికెట్ మాత్రమే వెనక ఉన్నాడు రబాడ. ఇక ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. 19 వికెట్లు తీసి.. పర్పుల్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2020, 10:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading